Breaking
Sat. Jun 28th, 2025

ఇన్ స్టాలో సమంత పోస్ట్ వైర‌ల్.. నాగచైతన్య కోస‌మేనా?

Samantha, Naga Chaitanya, స‌మంత‌, నాగ చైత‌న్య‌, సినిమా,

దర్వాజ-సినిమా

samantha reaction on chaitanya comments: క్యూట్ సినీ క‌పుల్ గా గుర్తింపు పొందిన నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల విష‌యం ఇప్ప‌టికీ హాట్ టాపిక్ గానే ఉంది. దాదాపు రెండేళ్ల కిందట నాగచైతన్య, సమంతలు విడిపోయారు. అయితే, దీనిపై వీరిద్ద‌రూ ఎందుకు విడిపోయార‌నే విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. తాజాగా నాగ చైత‌న్య న‌టించిన క‌స్ట‌డీ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా స‌మంత‌పై చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే స‌మంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. త‌న పోస్టులో ‘‘మనమంతా ఒక్కటే. కేవలం అహంకారం, కొన్ని నమ్మకాలు, భయాలు మాత్రమే మనల్ని వేరు చేస్తాయి’’ అని అమెరికా ఇన్వెస్టర్ నికోలా టెస్లా చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు. దీంతో పాటు సైకిల్ తొక్కుతూ ఓ పిల్లాడు పడిపోవడం, కానీ వెంటనే లేచి డ్యాన్స్ చేయ‌డం వంటి దృశ్యాలున్న వీడియోను కూడా పంచుకున్నారు. జీవితం సవాలు చేసినప్పుడు.. ప్రతిస్పందన ఇలానే ఉండాలంటూ పేర్కొన్నారు.

sma ఇన్ స్టాలో సమంత పోస్ట్ వైర‌ల్.. నాగచైతన్య కోస‌మేనా?

అంత‌కుముందు నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ సినిమా ప్ర‌మోష‌న్ లో సమంత ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాన‌ని తెలిపారు. సోషల్‌ మీడియాలో వదంతుల వల్ల తమ మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయని పేర్కొన్నారు.

Related Post