దర్వాజ-సినిమా
Samantha: ఆరోగ్యంతో పాటుగా.. అందమైన శరీరాకృతిని పొందడానికి వర్కౌట్లు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది నటీముణులు కూడా ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. షూటింగ్స్ లో కొంచెం గ్యాప్ దొరికినా చాలు జిమ్ సెంటర్లల్లో సెటిలైపోతుంటారు ముద్దుగుమ్మలు. అలాంటి వాళ్లల్లో సమంత కూడా ఒకరు. ఫిట్ గా ఉండేందుకు ఈ అమ్మడు తరచుగా వర్కౌట్లు చేస్తూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో అప్పుడప్పుడు పంచుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది.
కష్టతరమైన వర్కౌట్లను కూడా ఎంతో సునాయసంగా చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది ఈ కుందనపు బొమ్మ. ఇక తాజాగా ఈ అమ్మడు తన వర్కౌట్లకు సంబంధించి ఒక పోస్ట్ ను ఇన్ స్టాగ్రామ్ వేధికగా షేర్ చేసింది. అందులో ‘నేను వర్కౌట్లు చేయడానికి ఇదే కారణమని’ రాసుకొచ్చింది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఇన్ స్టా వేదికగా స్టోరీలో సమంత వర్కౌట్ చేస్తున్న ఓ ఫోటోను పెట్టి.. దానికి క్యాప్షన్ ‘వర్కౌట్స్ చేస్తోంది నేను తినడానికే’ అంటూ రాసుకొచ్చింది. మరొక స్టోరీలో సమోసాలు తినడానికే వర్కౌట్ చేస్తుందని అనుకునేలా ఒక ప్లేట్ లో సమోసాలు ఉన్న ఫోటో.. తో పాటుగా సమంత అక్కడే వర్క్ అవుట్ చేస్తున్న పిక్ ను షేర్ చేసింది.
శరీరంలో ఉన్న క్యాలరీస్ తగ్గితేనే సమోసాలు తినగలుగుతాం. సో అవి కరగాలంటే వర్కౌట్లు చేయాలి.. అనే అర్థం వచ్చేలా సమంత చెప్పుకొచ్చిందన్నమాట.
Krithi Shetty : సన్నజాబి పువ్వులా మెరిసిపోతున్న బేబమ్మ.. మరీ ఇంత అందమేంటిరా బాబూ..
Hair Problem Tips: వెంట్రుకలకు నూనె రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అస్సలు ఊడదు..
Deepika Pilli: ఏమి అందం ఏమి అందం.. దీపిక పిల్లి మరీ ఇంత అందంగా ఎలా పుట్టావమ్మా..
Sweater Dangers: చలికాలంలో స్వెటర్ వేసుకుని పడుకుంటున్నారా..? అయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే.?
Share this content: