దర్వాజ-సినిమా
Year Ender 2021: నేటి కాలంలో ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటారో.. అంతే తొందరగా విడిపోవడానికి కూడా వెనకాడటం లేదు. సినీ సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే.. సాధారణ జనాలు సైతం.. భాగస్వామి నచ్చకుంటేనో.. వాళ్ల వాళ్ల ప్రవర్తన తీరు మంచిగా లేకపోతేనో.. రకరకాల కారణాల వల్ల ఈజీగా విడిపోతున్నారు. కలకాలం కలిసుండాలని పెళ్లిళ్లు చేసుకుని ఏడాది లోపలే విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. ఇక ఈ ఏడాదిలో చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ భాగస్వాములతో విడిపోయారు. వాళ్లల్లో అక్కినేని నాగచైతన్య, సమంత కూడా ఉన్నారు.

ఈ జంట 2017 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సరిగ్గా 4 వ వార్షికోత్సవానికి 4 రోజులుందనంగా ‘మేము విడిపోతున్నామని’ సోషల్ మీడియా వేధికగా ప్రకటించారు. నాలుగేండ్ల వివాహ బంధానికి చై సామ్ లు స్వస్తి పలికి ఎవరి జీవితం వాళ్లు చూసుకుంటున్నారు. 15 ఏండ్ల పాటు కలిసున్న అమీర్ ఖాణ్ కూడా తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. 2006 అమీర్ ఖాన్ , కిరణ్ రావులు పెళ్లి బంధంతో ఒక్కట్టయ్యారు. కానీ కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఈ జంట కూడా విడిపోయింది. కాగా వీరి విడిపోవడానికి కథానాయిక ఫాతిమా సనా షేక్ యే కారణమని వార్తలు వినిపించాయి.

ఇకపోతే నటి నిఖిల్ జైన్, నుస్రత్ ఖాన్ కూడా ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని రెండేండ్ల పాటు సాఫీగా గడిపారు. అంతలోనే 2021 స్టార్టింగ్ లోనే విడిపోయారు. అలాగే 2016 లో నటి కీర్తి కుల్హారి సాహిల్ సెహగల్ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లై 5 ఏండ్లు కాగానే ఈ జంట కూడా విడాకులు తీసుకున్నారు. వీరిలాగే నటి నిషా రావల్ కూడా తన భర్త కరణ్ మెహ్రాన్ తో విడాకులు తీసుకుంది. తన భర్త గృహ పెట్టడమే కాకుండా.. వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడం వల్లే ఈ జంట విడిపోయినట్టు ఆరోపనలు వచ్చాయి. సింగర్ యోయో హనీ సింగ్ కూడా తన భార్యను గృహ హింసకు గురిచేశాడట. దాంతో ఆమె భర్తతో విడాకులు తీసుకుని తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పిందట తల్వార్. హనీ సింగ్ 2011 లో షాలినీ తల్వార్ ను పెళ్లి చేసుకున్నాడు.
Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్
Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్
Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు
North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?
Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’
Marriage Age Of Women: అమ్మాయిల పెళ్లి వయస్సు 18 కాదు.. మరి ఎంతంటే..?
Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత
AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..
Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?