Sat. Dec 14th, 2024

Polished rice: పాలిష్ చేసిన బియ్యం తింటే మంచిదా..? కాదా..? అసలు ఈ బియ్యాన్ని తినడం వల్ల వచ్చే ప్రమాదాలు తెలిస్తే షాక్ అవుతారు..?

Polished rice
Polished rice

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Polished rice: నేడు మనం తినే ప్రతి బియ్యం మెతుకు కూడా పాలిష్ చేసినదే. పాలిష్ చెయ్యని బియ్యం దొరకడం ఈ రోజుల్లో కరువనే చెప్పాలి. మనం ఇష్టం గా తినే ఈ పాలీష్డ్ బియ్యాన్ని వండుకుని తినడం వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి మీకు తెలుసా..? అందులోనూ ఈ బియ్యాన్ని తింటే డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలిష్ అంటే.. వడ్లపై ఉండే పొట్టు, ఊక, సూక్ష్మక్రిములను, పోషకాలను కొంతమొత్తంలో తొలగించడమే.

broun-rice-1024x683 Polished rice: పాలిష్ చేసిన బియ్యం తింటే మంచిదా..? కాదా..? అసలు ఈ బియ్యాన్ని తినడం వల్ల వచ్చే ప్రమాదాలు తెలిస్తే షాక్ అవుతారు..?

బియ్యాన్ని పాలిష్ చేసే విధానం:

వడ్ల గింజలను రైస్ పాలిషర్ మెషిన్ నుంచే బియ్యం పాలిష్ ప్రక్రియను నిర్వహిస్తారు. మొదటగా ఈ ధాన్యాన్ని యంత్రాల్లో వెయ్యడంతో.. ఆ యంత్రాలు ఆ గింజల పై ఉండే పొట్టును తీసేస్తుంది. ఆ తర్వాతే పాలిష్ చేస్తుంది. అంటే గింజలపై ఉండే పొరను తీసేస్తుందన్న మాట. దాంతో గింజలు సన్నగా.. తెల్లగా మారుతాయ. ఇక ఈ ప్రాసెస్ అంతా స్థూపాకారంలో ఉన్న సోరెల్ సిమెంట్ పూల వేసిన మెషిన్ లో ఈ మిల్లింగ్ జరుగుతుంది.

అన్ పాలిష్డ్ బియ్యం అంటే:

అన్ పాలిష్డ్ బియ్యం అంటే బ్రౌన్ రైస్ అనే చెప్పుకోవచ్చు. అంటే మెషిన్ లో వేసిన ధాన్యం పై పొట్టు మాత్రమే తీసేస్తారు. కానీ బియ్యం పొరను తీసేయరు. ఈ బియ్యంలో పోషకాలు మెండుగా అలాగే ఉంటాయి. ఈ బియ్యమే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే పాలిష్డ్ బియ్యం లాగా ఇవి సన్నగా కాకుండా లావుగా ఉంటాయి. అందులోనూ ఈ బియ్యంతో బిర్యానీలు చేసినా రుచిగా ఉండదు. సో జనాలు ఈ అన్ పాలిష్డ్ బియ్యానికి బదులుగా పాలిష్డ్ బియ్యాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

పోషకాల లేమి:

పాలిష్ చెయ్యని బియ్యంలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ పాలిష్డ్ చేసిన బియ్యంలో అయితే పోషకాలే ఉండవు. ముఖ్యంగా ఈ పాలిష్డ్ బియ్యం తల తల మెరుస్తూ.. సన్నగా కనిపిస్తాయంతే. అందులోనూ వీటిని తినడం వల్ల ఫైబర్ తక్కువగా లభిస్తుంది. ఫ్యాటీ కంటెంట్ తక్కువగా ఉండటంతో పాటుగా బయోటిన్, ఖనిజాలు, తేమ తక్కువగా ఉంటుంది. దీన్ని తిన్నా పెద్దగా లాభం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పాలిష్ చెయ్యని బియ్యం బ్రౌన్ కలర్ లో లావుగా కనిపించినా వీటిని తింటే మెగ్నీషియం, కాల్షియం, ఇనుము పుష్కలంగా లభిస్తాయి.

డయాబెటిస్ వచ్చే ప్రమాదం:

పాలిష్ చేసిన బియ్యంలో ఖనిజాలు, విటమిన్లు ఉండవు. అయితే బియ్యం పై పొరలో మధుమేహం రాకుండా చూసే పోషకాలుంటాయట. సో పాలిష్ చేసిన బియ్యం తింటే మధుమేహం సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ ఈ పాలిష్డ్ రైస్ తింటే వెంటనే రక్తంలో చక్కెర స్థాయి దారుణంగా పెరుగుతుందట. డయాబెటిస్ రాకుడదన్నా.. వచ్చిన వారు కూడా ఈ పాలిష్డ్ రైస్ తినకపోవడం ఉత్తమం.

Turmeric Side Effects: పసుపును ఈ వ్యాధిగ్రస్తులు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

Covid-19 New Variant : వెలుగులోకి వచ్చిన మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే చాలా డేంజర్..

Deepthi Sunaina: దీప్తి సునయన బాధలో ఉంటే .. షణ్ముఖ్ సిరితో చిల్ అవుతున్నాడా..?

Nidhhi Agerwal : థైస్ అందాలతో చూపును తిప్పుకోకుండా చేస్తున్న నిధి అగర్వాల్.. మరీ ఇంత హాట్ అయితే ఏట్టాగమ్మా..

RGV: సపోర్ట్ చేయాల్సింది పోయి.. మా నెత్తి మీద కూర్చుంటున్నారు: ఆర్జీవీ

Rashmika-Vijay Devarakonda: రష్మిక, విజయ్ దేవరకొండ నిజంగానే ప్రేమలో పడ్డారా..?

Gold-Silver Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Share this content:

Related Post