Loading Now
anemia

తొందరగా అలిసిపోయి, నీరసంగా అనిపిస్తోందా.! అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Anemia: చిన్న చిన్న పనులు చేసినా.. మొత్తమే పనులు చేయకపోయినా.. మీకు ఎప్పుడూ అలిసిపోయి.. నీరసంగా అనిపిస్తోందా.. అయితే అది ఖచ్చితంగా రక్తహీనత సమస్యే కావొచ్చు. ఈ సమస్యను త్వరగా గుర్తించకపోతే మాత్రం అది ప్రాణాంతకంగా మారుతుంది. ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువగా ఉత్పత్తి అయితేనే ఈ రక్తహీనత సమస్య వస్తుంది. ఈ కారణంతోనే మన శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయి పడిపోతూ ఉంటుంది.

ముఖ్యంగా ఈ రక్త హీనత వల్ల అనేక రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీ కుటుంబంలో ఎవరికైనా తలసేమియా ఉన్నా 50 శాతం వంశంలో రక్తహీనత వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీనితో పాటుగా ఎవరి జీవన శైలీ సరిగ్గా లేదు వారు కూడా ఈ రక్తహీనత బారినపడే అవకాశం ఉంది.

రక్తహీనతను ఇలా గుర్తించండి

నీరసంగా అనిపించడం. తలతిరడం, అలసటగా అనిపించడం, కాళ్లు చేతులు చల్లగా అవ్వడం, తలనొప్పి, గుండె కొట్టుకోవడంలో క్రమం తప్పడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య 40 శాతం గర్భిణులకే వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. అయితే గర్భిణులుగా ఉన్న సమయాల్లో ఈ రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇది పుట్టబోయే పిల్లలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

గర్భిణులు రక్తహీనతతో బాధపడితే ప్రసవ సమయంలో ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉంది. సో ఈ సమస్యనుంచి గర్భిణులు బయటపడాలంటే మాత్రం ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలనే తీసుకోవాలి. అలాగే ఆకు కూరలు, క్యారెట్, టమాటాలు ప్రతి రోజు మీ ఫుడ్ లీస్ట్ లో ఉండేట్టు చూసుకోవాలి. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Dengue: ఢిల్లీలో డెంగ్యూ పంజా

చలికాలమని నీళ్లు తాగకుండా ఉంటున్నారా?.. అయితే మీ పని అంతే..

T20 World Cup: నయా ఛాంపియన్ ఆస్ట్రేలియా

బట్టతల ఉందని బాధపడుతున్నారా.. ? అయితే మీకో గుడ్ న్యూస్..

పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్‌ నేరాలు

‘కాప్26లో పాల్గొన‌క‌పోవ‌డానికి ప్ర‌భుత్వ యంత్రాంగ‌మే కార‌ణం’

ఆవు పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

Samantha : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో సమంత చిందులు !

Share this content:

You May Have Missed