కాకరకాయ చేదుగా ఉన్నా.. ఎన్నో ఔషద లక్షణాలను కలిగి ఉంటుందన్న సంగతి మీకు తెలుసా.. దీనిలో ఏ కూరగాయలో లేనన్ని ప్రత్యేక గుణాలను కలిగి ఉంది. చేదుగా ఉంటుందని కొందరు కాకరకాయను తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఈ నిజాలను తెలుసుకుంటే కాకరకాయ ఎంత చేదుగా ఉన్నా అస్సలు విడిచిపెట్టరు. కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ముఖ్యమైన విటమిన్లను, ఆక్సీకరణలను మెండుగా కలిగి ఉంటుంది.
ఇందులో ముఖ్యంగా ఏ,బి,సి విటమిన్లను, బీటా కెరొటిన్ వంటిఫ్లవొనాయిడ్స్ కూడా కాకరకాయలో ఉంటాయి. వీటితో పాటుగా, జింక్, పొటాషియం, ఐరన్, కెరోటిన్, మెగ్నీషియం వంటి విటమిన్లు కాకరకాయలో మెండుగా ఉంటాయి. మరి కాకరకాయ ఏయే వ్యాధుల నుంచి విముక్తి చేయగలదో తెలుసుకుందాం పదండి..

ఇందులో ముఖ్యంగా మనం మొదటగా చెప్పుకోవాల్సింది మందుబాబుల గురించే. ఎందుకంటారా.. మందు బాబులకు కాకరకాయ సంజీవనిలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ మంద్యం తాగే వారు ప్రతి రోజూ ఒక గ్లాసు కాకరకాయ జ్యూసును తీసుకుంటే ఎంతో మంచిది. ఇది తాగడం మూలంగా మందుబాబుల లివర్ లో చేరుకున్న చెత్తంతా తొలగిపోతుంది మరి. దీంతో పాటుగా చెడు కొలస్ట్రాల్ కూడా తగ్గిపోతుందట. మొత్తంగా చెప్పాలంటే కాకరకాయ జ్యూస్ లివర్ కు ఒక టానిక్ లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే తాజాగా ఉన్నకాకరకాయలు తింటే ఆస్తమా, దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ కాకరకాయ ఆకులు లేదా పండ్లను ఉడికించి ప్రతి రోజూ తీసుకుంటే అంటురోగాలు మన దరిచేరవట. దీంతో పాటుగా రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మచ్చలు, మొటిమలు, చర్మ వ్యాధుల నుంచి విముక్తి పొందాంటే కాకరకాయ ఒక ఔషదంలా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా షుగర్ వ్యాధి గ్రస్తులకు కాకరకాయ మంచి ఔషదంలా ఉపయోగపడుతుందని ఇప్పటికే అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

ఇందులో పీచు లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఇది తొందరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా మలబద్దకం, అజీర్తి, అరుగుదల వంటి వివిధ సమస్యల వల్ల బాధపడేవారికి ఇది చక్కడి చిట్కా. అలాగే కాలెయం, మూత్రాశయాలను ఆరోగ్యంగా ఉంచడానికి కాకర ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాలల్లో ఏర్పడిన రాళ్లను తగ్గించడంలో కాకర చక్కటి ఔషదంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటుగా గుండెకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది కాకర. బరువును తగ్గించడంలో కాకరకాయ ముందుంటుందని నిపుణులు తెలుపుతున్నారు. చూశారు కదా.. కాకరకాయలో ఎన్ని ఔషద గుణాలున్నాయో.. ఇప్పటికైనా కాకరను అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
కోమలమైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!
వాట్సాప్ లో ఇక మెసేజ్ చేయలేరు !
దేశంలో పెట్రో మంటలు.. వరుసగా 12వ రోజు పెరిగిన ధరలు