దర్వాజ – హైదరాబాద్
Birth Date : మన జీవితం మీద సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) ప్రభావం ఎంతగానో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలు, నైపుణ్యాలు, ఆశయం మొదలైనవి అంచనా వేయవచ్చు. న్యూమరాలజీ నిపుణుల ప్రకారం, కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టినవారిలో తెలియని శక్తి, అంతుచిక్కని మ్యాజిక్ ఉంటుంది. ఆ వివరాలు గమనిస్తే..

5వ తేదీ – సాహసాలకు నిలువెత్తు నిదర్శనం
ఏ నెల అయినా 5వ తేదీలో పుట్టినవారు చాలా తెలివైనవారు. మార్పును స్వీకరించడంలో సిద్ధపడే వీరు, సాహసాలను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి ఊహాశక్తి విశేషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ, పరిస్థితేంటి అన్నదానిని త్వరగా అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ తేది వారు చురుకైన స్వభావంతో, శీఘ్రంగా ఎదగగలగే గుణంతో జన్మించినవారుగా ఉంటారని న్యూమరాలజీ పేర్కొంటోంది.

11వ తేదీ – ఆధ్యాత్మిక స్పర్శతో కూడిన జీవితం
11 అనేది న్యూమరాలజీ ప్రకారం “మాస్టర్ నెంబర్”. ఈ తేది వారు చిన్నప్పటి నుంచే జీవితంలో స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతారు. కలలపై గాఢమైన నమ్మకం, ఆత్మవిశ్వాసం వీరి జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి. వీరు ఎక్కడ ఉన్నా, అక్కడ సానుకూలతను వ్యాపింపజేస్తారు. అందుకే వీరిని చూసిన వారెవ్వరికైనా ఓ మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

22వ తేదీ – మాస్టర్ బిల్డర్స్
22వ తేది కూడా మాస్టర్ నెంబర్ లోకి వస్తుంది. ఈ తేదీలో పుట్టినవారు “మాస్టర్ బిల్డర్స్”గా ప్రసిద్ధి చెందుతారు. వారు కలలు కనడం మాత్రమే కాదు వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంలోనూ ముందుంటారు. సహజ నాయకత్వ లక్షణాలు కలిగిన వీరు ఇతరులను ప్రేరేపిస్తారు. ఏ పనినైనా పూర్తి చేసే పట్టుదల వీరిలో నిండుగా ఉంటుంది.

28వ తేదీ – అదృష్టాన్ని ఆకర్షించే ఆత్మ
28వ తేది న్యూమరాలజీలో పరిపూర్ణ సంఖ్యగా భావిస్తారు. ఈ తేదీలో జన్మించినవారికి దైవానుగ్రహం ఉంటుంది. వీరికి జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశంలో ఒక రకమైన గైడెన్స్, దివ్యశక్తి తోడుగా ఉంటుంది. అదృష్టాన్ని ఆకర్షించే గుణం వీరిలో మిక్కిలి. విజయాన్ని సాధించడంలో వీరు ముందుంటారు, ఆత్మవిశ్వాసంతో ప్రతిఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు.
మొత్తంగా చూస్తే, 5, 11, 22, 28 తేదీల్లో పుట్టినవారు సాధారణులకు భిన్నంగా ఉంటారు. వారిలో ఓ అంతర్లీన శక్తి ఉంటుంది. ఈ నాలుగు తేదీల్లో పుట్టినవారు, ఇతరులను ప్రభావితం చేయగల శక్తి కలవారు. వారి ఆశయాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు వారిని జీవితం లో స్ఫూర్తిదాయక వ్యక్తులుగా నిలబెడతాయి. న్యూమరాలజీ ప్రకారం వారు నిజంగా ప్రత్యేకులు!
