దర్వాజ-హెల్త్&బ్యూటీ
Hair Care Tips:వయస్సుతో సంబంధం లేకుండా నేడు ప్రతి ఒక్కరూ జట్టు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఆ నూనెలు.. ఈ షాంపూలు.. అంటూ రకరకాల యాడ్స్ చూసి వాటిని ఫాలో అయిపోతూ ఉంటారు. అయినా జుట్టు రాలడం ఆగదు. కానీ సింపుల్ చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు..
1.జట్టుకు నూనె పెట్టడం అలవాటు చేసుకోండి. నూనె పెట్టడం వల్ల బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరుగుంది. దాంతో మీ జుట్టు పొడుగ్గా అవడంతో పాటుగా వెంట్రుకలు నల్లగా కూడా మారతాయి. అయితే గోరు వెచ్చటి నూనెను తలకు పట్టించి కొన్ని నిమిషాల పాటు దువ్వకుండా వదిలేయండి. ఇలా చేస్తే జట్టుకు ఎక్స్ ట్రా కండిషనింగ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
2.వెంట్రుకలను నిగారింపును ఇవ్వడంలో ఉసిరి ముందుంటుంది. ఈ ఉసిరి కాయలు వెంట్రకలను తెల్లబడకుండా చేస్తాయి. అలాగే డాండ్రఫ్ ను రానివ్వదు. ముఖ్యంగా చిట్లిపోకుండా, సన్నబడకుండా చెయ్యడంలో ఉసిరి చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. సో పరిగడుపున ఉసిరిని తినడం వల్ల సి విటమిన్, పొటాషియం, మాంగనీస్, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. సో దీని వల్ల మీ జుట్టు నిగనిగా మెరిసిపోవడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
3.జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోయేలా చేయడంలో కలబంద ముందుంటుంది. ఈ కలబంద జెల్ ను తలకు పట్టించడం వల్ల ఎలాంటి హాని కలగదు. అందులోనూ జుట్టు రాలే సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.
- మనలో పోషకాల లోపం ఉంటే కూడా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. అందులోనూ కంటినిండా నిద్రలేకపోతే కూడా జుట్టు రాలుతుంది. సో ఎక్కువు పోషకాలున్న ఆహార పదార్థాలనుు తీసుకుంటూ.. టైంకు నిద్ర పోతే చాలు. జుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా నీళ్లు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.
- రోజూ తల స్నానం చేయడం కూడా అంత మంచిది కాదు. జిడ్డు ఎక్కువగా ఉంటేనే తల స్నానం చేయండి. అంతేకాని ప్రతి రోజూ పనిగట్టుకుని తలస్నానం చేయకండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడమే కాకుండా.. జుట్టు నిగారింపును, పటుత్వాన్ని కోల్పోతుంది. ప్రతి రోజూ షాంపూతో స్నానం చేయడం మంచిది కాదు. అందులోనూ నూనె రాయకుండా స్నానం చేయడకండి.
Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు
North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?
Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’
Marriage Age Of Women: అమ్మాయిల పెళ్లి వయస్సు 18 కాదు.. మరి ఎంతంటే..?
Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత
AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..
Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’
జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?