దర్వాజ-హెల్త్ & బ్యూటీ
hair problem tips: మారుతున్న జీవన విధానం మనపై చాలా ప్రభావమే చూపుతోంది. అందులోనూ ఆరోగ్యం విషయంలో ఇంకా ఎక్కువ అనే చెప్పాలి. కలుషిత వాతావరణం, సరైన పోషకాలు లేని ఫుడ్, జంక్ ఫుడ్ తో మన ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. వీటి వల్లే 100 ఏండ్లు బతకాల్సిన వాళ్లు 50 ఏండ్లకే జీవితాన్ని ముగించేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. అనారోగ్యంతో పాటుగా జుట్టు సమస్య కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉంది.
వయసుతో సంబంధం లేకుండా యూత్ కూడా హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గట్టెక్కడానికి ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఎన్నో రకాల షాంపూలు, నూనెలను ట్రై చేస్తూనే ఉన్నారు. అయినా జుట్టు రాలకుండా చేయలేకపోతున్నారు. పోషకాహార లోపంతో, జీన్స్ వల్ల కూడా జట్టు ఊడుతూ ఉంటుంది. ఇక ఆడవారికైనా.. మగవారికైనా జుట్టే అందం. సో ఆ అందాన్ని పదిలంగా ఉంచుకోవడానికి కేశ సంరక్షణ ఎంతో అవసరం.
ఆ సంరక్షణలో భాగమే నూనె రాయడం. కొందరు వారానికోసారి తలకు నూనె రాస్తే.. మరికొందరేమో రోజూ రాస్తారు. ఇలా నూనె రాయడం వల్ల చండ్రు రాదు. అలాగే కుదుళ్లకు పోషణ అంది.. జుట్టు బలంగా.. ఒత్తుగా మారుతుంది. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి కి గురికారు. అందులోనూ నైట్ టైం నిద్ర చక్కగా పడుతుంది. అయితే నూనె రాసుకున్నామా..అంటే రాసుకున్నట్టు కాకుండా ఒక పద్దతి ప్రకారం పెడితేనే ఫలితం ఉంటుంది. అదెలా అంటే..
- నూనె రాసుకునే ముందు జుట్టును చిక్కులు లేకుండా చక్కగా దువ్వుకోవాలి. అందులోనూ హార్ష్ గా అస్సలు దువ్వకూడదు. అలా దువ్వితే వెంట్రుకలు బాగా ఊడిపోతాయి.
- నూనె గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటేనే నూనె మాడుకు సులభంగా అంటుతుంది.
- ఒక్క స్కాల్ప్ కే కాకుండా కుదుళ్ల వరకు నూనెను పట్టించాలి. అలా రాస్తేనే వెంట్రుకలు బలంగా.. ఒత్తుగా ఉంటాయి.
- అలాగే నూనెను వెంట్రుకలకు పెట్టే టప్పుడు.. చేతిలో నూనెను అద్దుకుని తలంతా పట్టించకూడదు. వేళ్లతో కొంచెం కొంచెంగా అద్దుకుంటూ.. వెంట్రుకలను పాయలు పాయలుగా చేసి రాస్తే సరిగ్గా నూనె అప్లై అవుతుంది.
- ఒక వైపు రాసిన తర్వాత మరో వైపు నూనెను రాయాలి. అలా చేస్తేనే తలంతా నూనె అంటుతుంది. రెండు చేతుల్లో నూనె కొద్ది కొద్దిగా పోసుకుని వెంట్రుకలకు పట్టించాలి.
- నూనె రాసిన తర్వాత సున్నితంగా మాడును ఒక పావుగంట పాటు మర్దన చేయాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- ఒక రెండు గంటల తర్వాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది.
Krithi Shetty : సన్నజాబి పువ్వులా మెరిసిపోతున్న బేబమ్మ.. మరీ ఇంత అందమేంటిరా బాబూ..
Deepika Pilli: ఏమి అందం ఏమి అందం.. దీపిక పిల్లి మరీ ఇంత అందంగా ఎలా పుట్టావమ్మా..
Sweater Dangers: చలికాలంలో స్వెటర్ వేసుకుని పడుకుంటున్నారా..? అయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే.?
Gold Rates Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.
Periods: పీరియడ్స్ ప్రతినెలా రావడం లేదా.. అయితే వీటిని పాటించి ఈ సమస్యకు చెక్ పెట్టండి..
Share this content: