Breaking
Sat. Jun 28th, 2025

స్నానం ఏ సమయంలో చేస్తే మంచిది?

Health Benefits of Bathing
Health Benefits of Bathing

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Health Benefits of Bathing : తలార స్నానం చేస్తే వచ్చే హాయే వేరు. స్నానం చేయడంతో కొత్త ఉత్సాహం పుంజుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొందరు ఉదయాన్నే స్నానం చేస్తే మరికొందరు సాయంత్రం వేళల్లో స్నానం చేస్తుంటారు. అయితే ఏ పూట స్నానం చేస్తే మంచిదో కాదోనని చాలా మంది అనుమానపడుతుంటారు. నిజానికి స్నానం ఉదయం, సాయంత్రం వేళల్లో చేసినా పెద్దగా నష్టం ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఈ రెండు పూటల్లో స్నానం చేయడం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే జిడ్డు చర్మం ఉన్న వాళ్లు మాత్రం ఉదయాన్నే తలార స్నానం చేయడం ఎంతో మంచిదట. ఎందుకంటే రాత్రి పూట మన చర్మం పై పొరల్లో అదనపు నూనెలు చేరి మరింత జిడ్డుగా మారుతుందట చర్మం. సో వీరు పొద్దున్నే స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఉదయం స్నానం వల్ల నిద్రమత్తు వదిలి ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. అలాగే వర్కౌట్స్ చేసే వాళ్లు కూడా ఉదయం స్నానం చేయడం వల్ల శరీరంపై పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగించుకోవచ్చు. అలాగే పడుకునేముందు స్నానం చేయడం వల్ల నిద్ర మంచిగా వస్తుంది. నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల హాయిగా కునుకు తీయొచ్చని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

దుమ్ములేపుతున్న ‘లాలా భీమ్లా నాయ‌క్’ ప‌వ‌ర్ ఫుల్ సాంగ్ !

Sierra Leone: ఘోర ప్ర‌మాదం.. 92 మంది మృతి

Fire Accident: క‌రోనా ఆస్ప‌త్రిలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

Climate Change: ప్ర‌కృతి విధ్వంసం.. ప్ర‌కోపం..

ప్ర‌పంచ నాయకుల న‌ట‌న !

Petrol Price: ఆగ‌ని పెట్రో మంట‌లు

మ‌హిళా హ‌క్కుల‌పై అవ‌గాహ‌న అవ‌స‌రం : జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

గౌరీ లంకేష్ హత్య కేసు.. 17 మందిపై అభియోగాలు

Related Post