Breaking
Tue. Nov 18th, 2025

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. ప‌చ్చిమామిడి కాయ జ్యూస్ !

Health Benefits of Mango Juice_Raw mango juice summer_special drink
Health Benefits of Mango Juice_Raw mango juice summer_special drink

వేసవి కాలం రానే వ‌చ్చింది. చూస్తుండ‌గానే ఎండ‌లు దంచి కొడుతున్నాయి. ఇలాంటి సమ‌యంలో శ‌రీరానికి త‌గినంత నీరు ల‌భించే ఆహారం తీసుకోవ‌డం ముఖ్యం. అందులో స‌మ్మ‌ర్ చ‌ల్ల‌చ‌ల్ల‌గా జ్యూస్ తాగితే.. శ‌రీరానికి త‌గినంత చ‌ల్ల‌ద‌నంతో పాటు రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. స‌మ్మ‌ర్ లో ఇలాంటి లాభాలు క‌లుగ‌జేసే జ్యూస్‌ల‌లో వెరీవెరీ స్పెష‌ల్ ప‌చ్చిమామిడి కాయ జ్యూస్. (రా మ్యాంగో జ్యూస్)

ప‌చ్చిమామిడి కాయ జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడిమి తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చ‌ల్లద‌నాన్ని క‌లిగిస్తుంది. అతి దాహాన్ని తీరుస్తుంది. మామిడిలో ఉండే విట‌మిన్-సీ అధికంగా ఉంటుంది. కాబట్టి దీని వల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గొంతుపూత‌తో పాటు చిగ‌ళ్ల నొప్పిని త‌గ్గిస్తాయి. మామిడిలో ఉండే పెక్టిన్ అజీర్థిని తగ్గించడంతో పాటు జీర్ణ వ్యవస్థను పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో అధికంగా తీపీ ఉండదు కాబ‌ట్టి బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇది మంచి ఔష‌ధంలా ప‌నిచేస్తుంది.

మ‌న‌కు ఇన్ని లాభాలు క‌లుగ‌జేసే ప‌చ్చి మామిడికాయ‌ల జ్యూస్ త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. దీనికి
కావాల్సిన ప‌ద‌ర్థాలు:
1. మామిడికాయ ముక్కలు – 250 గ్రాములు
2. పంచదార – 750 గ్రాములు
3. యాలకులు – రెండు
4. కుంకుమపువ్వు – చిటికెడు
5. నీళ్లు – నాలుగు కప్పులు.

త‌యారు చేయు విధానం:

ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను శుభ్రంగా కడిగి, పై చెక్కు తీసి ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. క‌ట్ చేసిన ముక్క‌ల‌ను ఓ గిన్నెలో తీసుకుని నీళ్లు పోసి ఉడికించాలి. మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. ఆ తరువాత దీనికి తగినంత చెక్కెర ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి.. అందులో యాలకులు, కుంకుమ పువ్వు వేసి మిక్సీ పట్టుకోవాలి. ప‌చ్చిమామిడి జ్యూస్ రెడీ ! ఈ రసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మధ్యాహ్నంపూట తాగితే శరీరానికి చలువ చేస్తుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Related Post