Loading Now
Health Benefits of Watermelon juice_ summer special drink

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. పుచ్చ‌కాయ జ్యూస్

వేస‌వి కాలంలో నీరు అధికంగా ఉంటే ఆహార ప‌దార్థాలు, పండ్లు తీసుకోవ‌డం వ‌ల్ల స‌మ్మ‌ర్‌లో ఎలాంటి అనారోగ్యాలు ద‌రిచేర‌కుండా ఉంటాయి. అలాగే, ఆరోగ్యంగా కూడా ఉంటాం. వాటిలో సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ జ్యూస్. స‌మ్మ‌ర్ లో 90 శాతం నీరుండే పుచ్చకాయలో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన వ‌న‌రులు పుష్క‌లంగా ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా పుచ్చ‌కాయ‌లో విటమిన్‌-సి, రైబోఫ్లెవిన్‌ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే పీచు ప‌దార్థం జీర్ణ వ్య‌వ‌స్థ‌కు మేలు చేయ‌డంతో పాటు.. జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది.

పుచ్చ‌కాయ వ‌ల్ల పెగులపై పూత‌, అల్స‌ర్లు వంటివి ఏర్ప‌డ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ఇక స్థూల‌కాయంతో బాధప‌డే వారికి, నాజుకైన శ‌రీరం కావాల‌నుకునే వారికి దీనిని తీసుకోవ‌డంతో మెరుగైన ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. వంద గ్రాముల పుచ్చ‌కాయ నుంచి దాదాపు 17 కాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంద‌ని నిపుణ‌లు చెబుతున్నారు. పుచ్చ‌కాయ ర‌సంతో తేనే, పంచ‌దార క‌లిపి తీసుకుంటే శ‌రీరానికి శ‌క్తితో పాటు విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అందుతాయి. మూత్ర‌, చ‌ర్మ సంబంధ వ్యాధులు కూడా ద‌రిచేర‌కుండా ఉంటాయి.

ఇన్ని ఉప‌యోగాలు క‌లిగించే పుచ్చ‌కాయ జ్యూస్ త‌యారు చేసుకోవ‌డం చాలా సింపుల్‌. దీని కోసం

కావాల్సిన ప‌ద‌ర్దాలు :
1. చెక్కు తీసిన పుచ్చకాయ ముక్కలు – కప్పు,
2. నిమ్మరసం – అర చెంచా,
3. పంచదార/ తేనె – రుచికి సరిపడా,
4. నీళ్లు – గ్లాసు.

తయారు చేయు విధానం:
క‌ట్ చేసి పెట్టుకున్న పుచ్చ‌కాయ ముక్క‌ల‌ను మొద‌ట‌ మిక్సీలో వేయాలి. ఇందులో పంచదార, నిమ్మరసం, నీళ్లు కలిపి బ్లెండ్‌ చేసుకోవాలి. ఆ తరువాత వడకట్టుకుంటే పుచ్చకాయ జ్యూస్‌ రెడీ అయిన‌ట్టే !

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. ప‌చ్చిమామిడి కాయ జ్యూస్ !

నీటి బొట్టు.. బతుకు మెట్టు !

Share this content:

You May Have Missed