Loading Now
water

నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Health disease :శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడంలో నీళ్లు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. అందుకే ఒకరోజుకు శరీరానికవసరమయ్యే 7 నుంచి 8 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని ఎక్కువగా తీసుకుంటే బరువు కూడా తగ్గుతారని పరిశోధనలు వెళ్లడించాయి. ముఖ్యంగా అనేక రకాల రోగాల భారిన పడకుండా నీరు మనల్ని కాపాడుతుందన్న సంగతి మీకెరుకేనా.. ఇక ఈ సంగతి పక్కన పెడితే కొంతమంది అవసరానికి మించి నీటిని తాగుతూ ఉంటారు. అందేటి అంటే దాహం తీరడం లేదని చెబుతుంటారు. అలా మళ్లీ మళ్లీ దాహం నాలుగు రకాల వ్యాధులకు కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1.స్పైసీ ఫుడ్ ను తీసుకున్నప్పుడు కూడా జీర్ణం తొందరగా కాదు. అందుకే ఆ ఫుడ్ ను అరిగించడానికి నీళ్లు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలో తగినన్ని నీరు లేకపోవడమే.

2.ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా మధుమేమ సమస్య వస్తుంది. ఇక వీరి రక్తంలో చక్కెర లెవెల్స్ పెరగడం వల్లే దాహం తరచుగా అవుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే శరీరానికి సరిపడా నీరు లేకపోతే మూత్రపిండాలు పనిచేయవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3.మన శరీరంలో చెమటలు అధికంగా పడుతున్నట్టైతే మాత్రం నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. శరీర ఉష్టోగ్రతను సమతౌల్యం చేయడానికే ఎక్కువగా నీళ్లు తాగాలనిపిస్తుంది.

4.ఆందోళన ఎక్కువగా ఉన్న సమయాల్లో కూడా మనకు తరచుగా దాహంగా అనిపిస్తుంటుంది. ఆ సమయాల్లో కొన్ని ఎంజైమ్ లు లాలాజల ఉత్పత్తిని ఆపేస్తాయి. అందుకే మనకు ఎక్కువ దాహంగా అనిపిస్తుంది.

పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి

వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

‘అసలు మీరు మనిషేనా’ అని బాలయ్యను అడిగేసిన ప్రగ్యా

ఈ విషయం మీ అమ్మకు నువ్వైనా చెప్పు సిరి: శణ్ముఖ్

త‌గ్గుతున్న జనాభా.. పెరుగుతున్న ర‌క్త‌హీన‌త

ఫ్యాషన్ వేర్ లో కేక పుట్టిస్తున్న శృతి హాసన్

Share this content:

You May Have Missed