Loading Now
Improve Blood Oxygen Levels with Foods

ఆక్సిజ‌న్ ను పెంచే ఆహార ప‌దార్థాలు..

దర్వాజ-హైదరాబాద్

ప్ర‌స్తుతం మ‌న దేశం క‌రోనా సెకండ్ వేవ్ తో అత‌లాకుత‌లం అవుతోంది.రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి. చాలా మంది క‌రోనా బారినప‌డి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. కేసులు లక్ష‌ల్లో పెర‌గ‌డంతో ఆస్ప‌త్రుల్లో బెడ్స్ కొర‌త ఏర్ప‌డుతోంది. మ‌రో వైపు క‌రోనా పేషెంట్ల‌కు ఆక్సిజ‌న్ అంద‌కపోవ‌డంతో రోజుకు ఎంతో మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు.

కేవ‌లం ఆక్సిజ‌న్ లేక‌పోవ‌డం వ‌ల్లే చాలా మంది చ‌నిపోవ‌డం మ‌నం నిత్యం వార్త‌ల్లో చూస్తూనే ఉన్నం. అందుకే స‌హ‌జంగా మ‌న శ‌రీరంలో ఆక్సిజన్ పెంచ‌డం ఎంతో అవ‌స‌రం. అయితే శ‌రీరంలో ఆక్సిజ‌న్ ను పెంచ‌డానికి మ‌నం తీసుకునే ఆహార ప‌దార్థాల్లో 80 శాతం ఆల్క‌లీన్ ప‌దార్థాలు క‌చ్చితంగా ఉండాలి. అది మ‌న ర‌క్తంలో ఆక్సిజ‌న్ మొత్తాన్ని పెంచ‌డంలో ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందుకోసం మ‌రి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలంటే..

  1. నిమ్మ‌కాయ శ‌రీరానికి ఎంత మేలు చేస్తుందో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా నిమ్మ‌కాయ‌లో ఆక్సిజ‌న్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ నిమ్మ‌కాయ వల్ల‌ ద‌గ్గు, జ‌లుబు, గుండెలో మంట‌, ఫ్లూ, హైపోక్సిసిటీ వంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
  2. వేస‌వి దాహాన్ని తీర్చ‌డానికి పుచ్చకాయ దివ్య ఔష‌దంలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ పండు అధిక శాతం నీరును క‌లిగి ఉంటుంది. అలాగే ఈ పండు pH విలువ 9 ను క‌లిగి ఉంటుంది. అలాగే ఈ పండులో విట‌మిన్ సి పుష్క‌లంగా ల‌భిస్తుంది. లైకోపీన్, బీటా కెరోటిన్ క‌లిగి ఉత్త‌మ పండుగా పేరుగాంచింది.
  3. యాంటీ ఆక్సిడెంట్ ల‌ను ఎక్కువ మొత్తంలో కలిగిన అవోకాడో, బెర్రీలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి 8 పిహెచ్ విలువను క‌లిగి ఉంది. అలాగే బెర్రీలు, వెల్లుల్లి, మిరియాలు రక్తపోటును నియంత్రించే గుణాల‌ను క‌లిగున్నాయి. వీటితో పాటుగా ద్రాక్ష‌, క్యారెట్లు, అర‌టి పండ్లు మ‌న రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని పెంచడంలో ముందుంటాయి.
  4. కివి, క్యాప్సిక‌మ్ ల‌ల్లో పిహెచ్ 8.5 విలువ ఉంటుంది. ఈ ఆహార ప‌దార్థాలు కూడా శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Share this content:

You May Have Missed