Loading Now
lose thigh fat

తొడ భాగంలో కొవ్వు కరగాలా? అయితే ఈ టిప్స్ పాటించండి..

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

lose thigh fat: కొందరి శరీరాకృతి చూడ చక్కగా ఉంటుంది. చూడగానే కుందనపు బొమ్మలా కనబడుతుంటారు. అలాగని అందరి శరీరాకృతులు ఒకేలాగ ఉండవు కదా. కొందరు నాజుగ్గా ఉంటే.. మరికొందరేమో బొద్దుగా ఉంటారు. మరికొందరికైతే తొడలు మాత్రమే లావుగా ఉంటాయి. ఆ ప్రదేశంలో పేరుకుపోయిన కొవ్వే దానికి ప్రధాన కారణం. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

  • స్లైక్లింగ్ చేయడం వల్ల కాళ్లు, తొడలపై పేరుకుపోయిన కొవ్వు ఈజీగా కరుగుతుంది. షాప్ లకు, మార్కెట్ కు ఎక్కడకు వెళ్లినా సైకిల్ పై వెళ్లడం వల్ల కొవ్వును కరిగించొచ్చు.
  • శరీరానికి సరిపడే నీటితో కొవ్వును కరిగించొచ్చు. అదేలాగంటారా.. మన శరీరంలోని కొవ్వును కాలెయం శక్తిగా మారుస్తుంది. సో ఆ కాలెయానికి అవసరమయ్యే నీటిని గనక మనం తాగితే మన కొవ్వును కరిగించినట్టే.
  • అలాగే క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గుతారు.
  • గోడకుర్చీ వేసినట్టు పొజీషన్ లో ఉండి బరువులెత్తితే కూడా ఆ భాగంలో కొవ్వును క్రమక్రమంగా కరిగించొచ్చు.
  • ఆటలు ఆడే అలవాటుంటే ప్రతిదినం ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ ఆడటంతో కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • ఉదయం పూట జాగింగ్ చేయడం, గడ్డిపై నడవడం వల్ల శరీరంలో ఎక్స్ ట్రాగా ఉన్న కొవ్వును, తొడల బరువును కూడా తగ్గించొచ్చు.
  • వీటితో పాటుగా శరీరంగా నాజుగ్గా, అందంగా తయారవ్వాలంటే ఈత కొట్టండి. ఈత వల్ల మనం బలంగా తయారవ్వడమే కాకుండా తొడలు సన్నబడతాయి.

Share this content:

You May Have Missed