Breaking
Sat. Jun 28th, 2025

సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..

smartphone
smartphone

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Mobile Phone: ప్రపంచంలోని సమాచారాన్నంతా ఒక్క అరచేతిలోనే చూడొచ్చు. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. తరచుగా ఫోన్ల లోనే గడపడం మాత్రం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ఫోన్లకు బానిసలుగా మారి నిమిషం కూడా దాన్ని వదలకుండా ఉండని వారు చాలా మందే ఉన్నారు. ఒక స్టేజ్ లో అది లేకుంటే ప్రాణాలు కూడా తీసుకున్న ఘటనలు మనకు తెలియనివి కావు. ఫోన్ లేకపోతే ఏదో మిస్సయ్యిందన్న ఫీలింగ్.. రింగ్ కాకపోతే, మెసేజ్ లు రాకపోయినా తెగ కలవరపడిపోయే స్టేజ్ చేరకున్నారు. తరచుగా ఫోన్లను చెక్ చేయడం, వాట్సాప్, ఫేస్ బుక్ లను ఓపెన్ చెయ్యడం లాంటివి చేస్తున్నారు.

Teen-ADHD-cell-use-700x466-compressor సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..

మరొక వింతైన విషయం ఏమిటంటే పక్కనున్న వారి ఫోన్ రింగ్ అయినా తమ ఫోన్ల నేమో అంటూ చూసుకుంటారు. వందలో 90 మందిలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా.. అయితే డౌటే లేదు.. మీకు ఆ జబ్బులు రావడం ఖాయం.. ఫోన్లు కనబడకపోతే.. మెస్సేజ్ లు రాకపోతే కలవర పడటం లాంటివన్నీ వాళ్లకు తెలియకుండానే జరుగుతున్న చర్యలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇక వీటిని అతిగా వాడటం వల్ల కంటికి సంబంధించి సమస్యలు వస్తాయన్న విషయం తెలిసిందే.

young-woman-checks-mobile-phone-from-bed-768 సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..

ఇక తాజాగా దీన్ని గంటల తరబడి వాడటం వల్ల రింగ్జైటీ వస్తుందట.. ఈ సమస్య సెల్ ఫోన్ను పరిధి దాటి యూస్ చేసే వారిలోనే ఇది కన్పిస్తుందట. ఇది వచ్చిన వారు తరచుగా ఫోన్లను చెక్ చేయడం, చిన్న సౌండ్ వచ్చినా.. మెసేజెస్ వచ్చాయేమోనని చూడటం, ఫోన్ రింగ్ అవుతుందేమోనని దాన్నే అంటిపెట్టుకుని ఉండటం, నిద్రపోకుండా ఏమన్నా అప్ డేట్స్ వస్తాయేమోనని చూడటం వంటివి చేస్తుంటారట. ఈ సమస్య ముఖ్యంగా సెల్ ఫోన్ల తో ఎక్కువగా గడిపే ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్స్, మహిళల్లో కనిపిస్తుందట. రాత్రుళ్లు ఎక్కువగా దీన్ని చూడటం వల్ల నిద్రలేమి సమస్యతో పాటుగా కళ్లు, మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. సో దీన్ని ఒక సమస్యగా పరిగణించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..

పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి

వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

‘అసలు మీరు మనిషేనా’ అని బాలయ్యను అడిగేసిన ప్రగ్యా

ఈ విషయం మీ అమ్మకు నువ్వైనా చెప్పు సిరి: శణ్ముఖ్

త‌గ్గుతున్న జనాభా.. పెరుగుతున్న ర‌క్త‌హీన‌త

Related Post