గోరింటాకుతో ఎన్నో ప్రయోజనాలున్నాయో తెలుసా?
గోరింటాకు పేరు వింటే చాలు యువతుల చేతులు ఎర్రగా పండిన ఒక అందమైన రూపం మన కళ్ల ముందు నిలుస్తుంది కదూ. అవును గోరింటాకంటే అమ్మాయిలకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం మరి. అందుకే సమయం దొరికినప్పుడల్లా.. గోరింటాకును తమ అందమైన చేతులకు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అది పెట్టుకుని నీకు అర్రగా పండుతుందా.. నాకు ఎర్రగా పండుతుందా.. నీకు తెలుసా ఎర్రగా పండితే.. మంచి భర్త వస్తాడని ముచ్చటలాడుతూ ఉంటారు. చేతులను అందంగా చేయడంతో పాటుగా ఈ గోరింటాకులో ఎన్నో ఔషద గుణాలున్నాయన్న సంగతి మీకు తెలుసా. కొందరు గోరింటాకును చేతులకే కాకుండా.. తలకు కూడా పెట్టుకుంటూ ఉంటారు.

అలా చేయడం వల్ల కురులు సౌందర్యంగా ఉండటంతో పాటుగా… శరీర వేడిని కూడా తగ్గిస్తుందని భావిస్తారు. ఇక దీంతో పాటుగా గోరింటాకును దెబ్బలు తగిలిన చోట పెడతారు. ఇలా పెట్టడం మూలంగా దెబ్బ తొందరగా తగ్గిపోతుంది. ఇవే కాకుండా గోరింటాకు వల్ల ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం పదండి. కీళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. నొప్పి ఉన్న చోట కాస్త గోరింటాకును తీసుకుని రాయాలి. అలాగే అరికాళ్లు మంటగా అనిపించినప్పుడు కూడా గోరింటాకును వాడతే మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవే కాకుండా నోరు పుచ్చిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ కాకుండా ఉండటానికి గోరింటాకు ముద్దను నోట్లో పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గోరింటాకే కాకుండా ఆ చెట్టు బెరడు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడాయి. ఈ బెరడు, విత్తనాలు ముఖ్యంగా జ్వరాన్ని తగ్గించేందుకు మంచి ఔషదంలా ఉపయోగపడుతాయి. దీంతో పాటుగా వీటి విత్తనాలు విరుచనాలను కూడా తగ్గిస్తాయట. అలాగే ఈ గోరింటాకు ముద్దలను తినడం వల్ల శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గిస్తుంది. ఇక అధిక తలపోటుకు గురయ్యేవారు గోరింటాకును మాడుకు పట్టించడం వలన తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే తెల్లవెంట్రుకలకు గుడ్ బాయ్ చెప్పాలంటే.. గోరింటాకును వారానికి ఒకసారి వెంట్రుకలకు పట్టించడం వల్ల శాశ్వతంగా వెంట్రుకలు నలుపురంగులోకి మారిపోతాయి.

ముఖ్యంగా ఈ గోరింటాకును నమలడం మూలంగా చిగుళ్ల సమస్య ఉన్నవాళ్లకు మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి గోరింటాకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు నీరును లేదా విత్తనాలను తీసుకోవడం వల్ల గుండె వ్యవస్థపై పడిన ఒత్తిని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుంది ఈ గోరింటాకు. ముఖ్యంగా హర్ట్ ఎటాక్, స్ట్రోక్ లను దూరం చెయ్యడంలో గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుందట.
టీవీ, మొబైల్స్.. డెంజర్‌లో టీనేజర్స్ !
కోమలమైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!