దర్వాజ-హెల్త్ & బ్యూటీ
Nighttime eating: ఈ గజిబిజీ లైఫ్ లో తిన్నామా అంటే తిన్నాము అన్నట్టే ఉంది కొందరి వాలకం. ఆకలేస్తే చాలు అది ఆరోగ్యానికి మంచిదా కాదా అనే అలోచన లేకుండా కడుపులో వేసేస్తున్నారు. మరికొందరైతే అర్థరాత్రైనా తినకుండా ఫోన్లతో, టీవీలతో కాలక్షేపం చేసేస్తుంటారు. అందులో ఆకలైతే చాలు ఏది పడితే అది తినేస్తుంటారు. ఫలితంగా ఊబకాయం వంటి రోగాల బారిన పడుతున్నారు.
అర్థరాత్రైనా హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఎటువంటి అనారోగ్యాల భారిన పడకుండా ఉంటారు. మరి ఇటువంటి సమయంలో తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే.. పీచుపదార్థం ఎక్కువగా ఉండే బెర్రీ పండ్లను తీసుకోవాలి. ఈ పండులో ఉండే మెగ్నీషియం కండరాలను, నరాలను విశ్రాంతిగా అయ్యేట్టు చేస్తుంది. అలాగే చిరుధాన్యాలతో చేసిన మురుకులు, అప్పడాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఇవేకాకుండా పాప్ కార్న్ రాత్రిళ్లు తినడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. అలాగే తక్కువ క్యాలరీలున్న క్యారెట్ కూడా తినొచ్చు. వీటితో పాటుగా పోషకాలు మెండుగా, తక్కువ క్యాలరీలున్న పుట్నాలు కూడా మంచి స్నాక్స్ లాగా తినొచ్చు. ముఖ్యంగా వీటిలో మినరల్స్, విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.
Crime: ఎంతటి అమానుషం.. సంతానం కోసం 16 నెలలుగా యువతిని బంధించి..
Air Pollution: కాలుష్యం.. ప్రపంచంలోనే టాప్‌లో ఢిల్లీ
Tulsi Gowda: అడవి తల్లి బిడ్డకు దక్కిన ‘పద్మం’.. ఆమె కథేంటీ?
పిల్లల్ని కనడంపై ఉపాసన సమాధానం ఇదే..
Kangana Ranaut: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్య్రం’ : కంగనా రనౌత్
3 Roses: నేను నీ కంటే చాలా పెద్దదాన్ని : పూర్ణ
బాబోయ్ బాలయ్య ఏంటా ఎనర్జీ.. అన్ స్టాబబుల్ స్టేజిపై బాలయ్య అదిరిపోయే స్టెప్పులు
Jai Bhim: సినతల్లికి మంచి ఇల్లు కట్టిస్తా; లారెన్స్