Breaking
Sat. Jun 28th, 2025

కుక్కర్ లో వండిన అన్నం తింటే మంచిదేనా?

Pressure coocker rice
Pressure coocker rice


దర్వాజ-ఆరోగ్యం

pressure cooked rice: మారుతున్న కాలంతో పాటుగా మన అలవాట్లు కూడా రోజు రోజుకు మారిపోతూనే ఉన్నాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా మారకపోతే ఎలా.. వెనకబడి పోం.. అంటూ జనాలు ఎదురు ప్రశ్నిస్తుంటారు. అందుకే కదా ఒకప్పుడు అన్నాన్ని మట్టితో చేసిన పాత్రల్లో వండుకుని తినేవాళ్లం. కానీ ఇప్పుడు ఈజీగా నిమిషాల్లో అన్నాన్ని వండే ప్రెజర్ కుక్కర్ లో వండుకుని తింటున్నాం. స్టీల్ పాత్రల్లో వండుకునే రోజులు ఎప్పుడో పోయాయి. నూటికి 90 శాతం మంది అన్నానికి కుక్కర్ నే వండుకుని తింటున్నారు. అయితే ఈ కుక్కర్ లో అన్నం తొందరగా అవడంతో పాటుగా పర్ఫెక్ట్ గా కూడా అవడంతో జనాలు అన్నాన్ని కుక్కర్ లోనే వండటానికే ఇష్టపడుతున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈ ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండుకుని తినే వారిలో ఒక కొత్త సమస్య తలెత్తింది. అందేంటంటే.. ఇంతకి అన్నం బాగానే ఉన్నా.. ఇందులో వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే డౌట్ లు తలెత్తుతున్నాయి. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నాన్ని తినడం ఆరోగ్యానికి ఎటువంటి హానీ ఉండదట. అంతకు మించి దీని వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయట. అందులోనూ ఇందులో వండిన రైస్ రుచి కూడా సూపర్ గా ఉంటుందట. అంతకు మించి ఇందులో వండిన అన్నంలో ఫ్యాట్ కూడా తక్కువ మోతాదులో ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు.ఊబకాయులు ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం తినడం చాలా మంచిదట. ఎందుకంటే ఇందులో వండిన అన్నంలో పిండి పదార్థం పూర్తిగా తొలగిపోతుందట. అలాగే పోషకాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు గిన్నెలో వండిన అన్నంలో కాకుండా ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నంలోనే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటుగా కుక్కర్ లో వండిన అన్నాన్ని తింటే జీర్ణం కూడా సులువుగా అవుతుంది.

అలాగే దీనిలో వండటం వల్ల సాధారణంగా నీటిలో, బియ్యంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు కూడా చనిపోతాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. సో ఇన్ని ప్రయోజనాల కారి ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నాన్ని తినడం ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు రావు. ఇంకేం ఎంచక్కా పర్ఫెక్ట్ గా వండే ప్రెజర్ కుక్కలోని అన్నాన్ని తిని ఆరోగ్యంగా, బేషుగ్గా ఉండండి.

https://darvaaja.com/sleeping/

Also Read:

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?

బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..

పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే

https://darvaaja.com/cds-general-bipin-rawat-biography-and-family-details/

Related Post