దర్వాజ-హెల్త్ & బ్యూటీ
Heart attack signs: వయసుతో సంబంధం లేకుండా నేడు చాలా మంచి హార్ట్ ఎటాక్ భారిన పడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నామనుకునే వాళ్లు కూడా దీని భారిన పడి చనిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అందులోనూ సడన్ గా గుండె పోటుకు గురై ప్రాణాలు పోయాయి.. అన్న వార్తలను మనం ఈ మధ్య తరచుగా చూస్తూనే ఉన్నాం. కారణాలేవైనా.. హార్ట్ ఎటాక్ ను ఈ గుర్తించడమెలా? అని నేడు తరచుగా వినిపిస్తున్న ప్రశ్న. క్రింద తెలిపిన లక్షణాలు మీలో గనుక ఉంటే.. ముందే అలర్ట్ అయ్యి ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు. అవేంటంటే..
ఎసిడిటీ, హైపర్ టెన్షన్ తో బాధపడేవారు కూడా గుండె పోటు కు గురయ్యే అవకాశముందని తాజాగా ఓ నివేధిక వెళ్లడించింది. బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ (బీహెచ్ఎఫ్) ప్రకారం హార్ట్ ఎటాక్ ముందు వచ్చే లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
- ఎప్పుడూ నలతగా అనిపిస్తూ ఉంటుంది.
- బాడీ వేడిగా మారిపోవడం, తరచుగా అలసటగా అనిపిస్తూ ఉంటుంది.
- గుండెల్లో అప్పుడప్పుడు నొప్పిగా అనిపించడంతో పాటుగా.. హార్ట్ లో ఆందోళన కలుగుతుంటుంది.
- బటయ ఎటువంటి శబ్దాలు లేకున్నా.. మీ చెవిలో ఏవేవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి.
- ఒక్కోసారి ఊపిరి ఆడదు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి.
- మైకం కమ్మినట్టు అనిపించడంతో పాటుగా.. కళ్లు మసకబారుతుంటాయి.
- అప్పుడప్పుడు లేదా.. తరచుగా వేళ్లు జలదరిస్తుంటాయి.
- ఉన్నట్టుండి వేడి ఎక్కువగా అనిపించడం.. చలి తీవ్రత పెరగడం జరుగుతాయి.
పై లక్షణాలన్నీ కొన్ని రోజులుగా జరగడం లేదా.. ఉన్నట్టుండి కూడా వస్తుంటాయని అధ్యయనం వెళ్లడిస్తుంది. వీటితో పాటుగా తీవ్రమైన దగ్గు కూడా ఒక లక్షణమే అంటూ పేర్కొన్నది. విపరీతమైన గురక కూడా గుండె నొప్పి వచ్చే సూచనగానే వెళ్లడించింది. ఇవన్నీ హార్ట్ ఎటాక్ కు ఉండే సాధారణ లక్షణాలు. అయితే మయో క్లీనిక్ ప్రకారం.. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు తీవ్రమైన కడుపు నొప్పి రావడం, చల్లగా చెమటలు పట్టడంతో పాటుగా వికారంగా కూడా అనిపిస్తుంటుంది. అలాగే ఛాతిలో నొప్పి మొదలై ఊపిరి ఆడకుండా.. మైకం కమ్మినట్టుగా అనిప్తాయని వెళ్లడించింది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
Shriya Saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..
Samantha: ఏంటీ సమంత వర్కౌట్స్ చేసేది ఇందుకోసమా..?
Corona Bulletin: డౌటే లేదు థర్డ్ వేవ్ మొదలైనట్టుంది.. భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
Krithi Shetty : సన్నజాబి పువ్వులా మెరిసిపోతున్న బేబమ్మ.. మరీ ఇంత అందమేంటిరా బాబూ..
Hair Problem Tips: వెంట్రుకలకు నూనె రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అస్సలు ఊడదు..
Deepika Pilli: ఏమి అందం ఏమి అందం.. దీపిక పిల్లి మరీ ఇంత అందంగా ఎలా పుట్టావమ్మా..