Loading Now
Tomato Face Packs For Healthy Skin

టమాటాతో ఇవి మీ సొంతం..!

ఒకప్పుడు టమాటా చెట్టు ఇంటి ముందు ఒక అందమైన ‘లవ్ యాపిల్ ’మొక్కగా పెరిగింది. కానీ కాలక్రమంలో అది ఒక కూరగాయగా మారిపోయింది. ప్రస్తుతం మన దేశంలో ఈ టమాటా లేని వంట లేదని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. భారతీయ వంటకాల్లో టమాటే ప్రధాన కూరగాయగా మారిపోయింది. టమాట లేని వంట అంటే ఉప్పు లేని పప్పు చారుగానే భావిస్తుంటారు చాలా మంది.

అందునే నేడు టమాటాకు అంద క్రేజ్ ఏర్పడింది. అయితే టామాటా అసలు ఎక్కడ పుట్టింది.. ఎక్కడ నుంచి మనదేశం వచ్చింది అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ టామాటా అమెరికా నుంచి ఇంగ్లాండ్ చేరి అక్కడ నుంచి మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. టమాటా సుమారుగా 1850 లో భారతదేశంలోకి అడుగుపెట్టింది.ఈ టమాటాకు మరో పేరు కూడా ఉందండీ.. అదే రామ ములగ పండుగా కూడా పిలవబడుతుంది.

8 టమాటాతో ఇవి మీ సొంతం..!

కాగా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే టమాటా దేశీ కారగాయల స్థానాన్నికూడా సంపాదించేసుకుంది. ప్రస్తుతం టమాటా లేని కూర, ఇల్లు, ఆఖరికి దుకాణం కూడా లేదేమో. టమాటాను ప్రతి రోజు తింటున్నా.. చాలా మందికి దానిలోని ఔషద గుణాలు తెలియవు. టమాటాను తినడంతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం లు పుష్కలంగా ఉంటాయి. వీటి వలన మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.మరి టమాటా చేసే మేలు ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి. టామాటాలో విటమిన్ కె, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. వీటి వలన ఎముకలు కట్టి పడటంతో పాటుగా.. బలంగా కూడా ఉంచడానికి టామాటా ఎంతో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

4 టమాటాతో ఇవి మీ సొంతం..!

వీటితో పాటుగా ఇందులో ఉండే విటమిన్ ఏ కూడా మన చూపును మెరుగు పరుస్తుంది. రేచీకటి ఉన్న వారికి టమాటా చక్కటి నివారణాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టమాటా క్యాన్సర్ ప్రమాదాలను దరిచేరకుండా చేయగలుగుతుంది. అలాగే ఈ టమాటా బ్లడ్ షుగర్ లెవల్స్ ను కూడా బ్యాలెన్స్ చెయ్యడంలో ముందుంటుంది.

3 టమాటాతో ఇవి మీ సొంతం..!

శరీర బరువును తగ్గించడంతో పాటుగా నొప్పులను కూడా తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక టమాటా ఆరోగ్యానికి ఈ విధంగా మేలు చేస్తే.. అందానికి అంతకుమించి మేలు చేస్తుంది. జుట్టును కాంతి వంతంగా.. బలంగా చేయడానికి టమాటాలో ఉండే విటమిన్ ఏ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే బీటా కెరోటిన్ కూడా మన చర్మాన్ని రక్షించడంలో ముందుంటుంది.

7 టమాటాతో ఇవి మీ సొంతం..!

అలాగే ఈ టామాను తీసుకుని దానికి కాస్త చెక్కెర అద్ది.. దానిని మీ చర్మం పై రుద్దితే గనక.. చర్మంపై ఉండే గీతలు గట్రా తొలగిపోయి.. చర్మం కాంతివంతంగా మెరవడంతో పాటుగా ముడతలు కూడా పోతాయట.

రాజా.. ఏంటీ క‌య్యం ?

మేడారం జాతర‌కు వేళాయ‌రా..!

క‌డుపునొప్పి, విరోచ‌నాలు అయితే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

టీవీ, మొబైల్స్.. డెంజ‌ర్‌లో టీనేజ‌ర్స్ !

కోమ‌ల‌మైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!

షుగ‌ర్ తో జ‌ర పైలం!

Share this content:

You May Have Missed