Loading Now
Toothpaste Skeletal fluorosis

వామ్మో.. టూత్ పేస్ట్ తో పిల్లలకు ఇంత డేంజరా?

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Toothpaste_Skeletal fluorosis: ప్రతి రోజూ దంతాలను క్లీన్ చేయడానికి మనం వాడే టూత్ పేస్ట్ గురించి మీకు తెలుసా.. అసలు మోతాదుకు మించి దానిని వాడటం లేదా ఆ పేస్ట్ ను మింగడం వల్ల ఎంత ప్రమాదమో మనలో చాలా మందికి తెలియదు. ఈ టూత్ పేస్ట్ ను అతిగా వాడటం, పేస్ట్ ను ఇష్టంగా తినడం మూలంగా అనేక సమస్యలొస్తాయని న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు వెళ్లడించారు.

ఫ్లోరైడ్ తో ఉన్న ఈ పేస్ట్ ను పిల్లలు తినడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుందట. ముఖ్యంగా ఆరేండ్ల లోపు చిన్నారులు పేస్ట్ ను తినకుండా చూసుకోవాలి. లేదంటే పిల్లల టీత్ ఎల్లో కలర్ గా మారడంతో పాటుగా చేతులు, కాళ్లు, చేతులు నొప్పులు, కీళ్లల్లో నొప్పులు వస్తాయి. అలాగే మోకాళ్ల చుట్టూ వాటు రావడంతో పాటుగా కూర్చోవడం, వంగడం వంటి సమస్యలు కూడా వస్తాయట.

ముఖ్యంగా పాదాలు బయట, లోపల వంపులు తిరుగుతాయట. సో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. మీ పిల్లలకు తక్కువ ఫ్లైరైడ్ ఉన్న పేస్ట్ లను మాత్రమే ఇవ్వండి. అలాగే వాళ్లు బ్రష్ చేసుకునేటప్పుడు.. టూత్ పేస్ట్ ను మింగకుండా కనిపెట్టుకుని ఉండండి. ప్రతిరోజూ కేవలం బఠానీ గింజంత మోతాదులో ఉండే పేస్ట్ తో క్లీన్ చేసుకోవచ్చు. సో ఇంతకు మించి మీ పిల్లలు ఎక్కువగా టూత్ పేస్ట్ ను తింటే గనుక డాక్టర్లకు చూపించడం ఉత్తమం.

Crime : క్షణికావేశం.. తీసింది భర్త ప్రాణం..

వామ్మో నిద్ర పోకపోతే ఇంత పెద్ద సమస్యా?

Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న విడుద‌ల

పోషకాహార లోపంలో 33 లక్షల మంది చిన్నారులు

సెలవు దక్కలేదనే కోపంతో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి

Chapped Lips Tips:చలికి పెదవులు పగులుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీ కోసమే..

Gold Price:మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Share this content:

You May Have Missed