దర్వాజ-హెల్త్ & బ్యూటీ
Turmeric Side Effects: సాధారణంగా ప్రతి వంట గదిలో ఖచ్చితంగా పసుపు ఉండాల్సిందే. ఈ పుసుపును వినియోగించనిదే కొందరు వంటలు కూడా చేయరు. ఆంటి బయాటిక్ గా పసుపు పనిచేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. చిన్న చిన్న దెబ్బలకు మందుగా ఈ పసుపునే పెట్టడం మనము చూస్తూనే ఉంటాం. ఇక ఈ పసుపును వంటకాల్లోనే కాదు.. ఇంటి గడపలకు కూడా రాస్తుంటారు. క్రిమికీటకాలు గడపదాటి లోపలికి రానీయకుండా పసుపు అడ్డుకుందని ఇలా చేస్తుంటారు. దివ్య ఔషదంగా వెలుగొందుతున్న ఈ పసుపు ప్రాచీన కాలం నుంచి వివిధ ఆయుర్వేధ ఔషదాల్లో వినియోగించబడుతూనే ఉంది. పొటాషియం, ఐరన్, డైటరీ ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లు, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ B6, సోడియం, జింక్ లు పుష్కలంగా పసుపులో ఉంటాయి.
ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇక పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలంగా అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చేయడంలో ముందుంటుంది. పసుపు ఎన్నో రకాలుగా మనల్ని ఆరోగ్యంగా చేయడంతో పాటుగా.. ఆనారోగ్య సమస్యలను దూరం చేయడంలో దివ్య ఔషదంలా పనిచేస్తుంది. అయితే పసుపు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. ఈ పసుపు వల్ల కొన్ని రకాల రోగాలతో బాధపడుతున్న వారికి మాత్రం అంత మంచిది కాదు. వారు పసుపుకు దూరంగా ఉండటం చాలా బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏయే వ్యాధిగ్రస్తులు ఈ పసుపు కు దూరంగా ఉండాలంటే..
కిడ్నీల్లో రాళ్లున్న వారు: కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధ పడే వారు పసుపును తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పుసుపు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. సో పసుపును మీ వంటకంలో లేకుండా చూడటం మంచిది. అయితే డాక్లర్ సలహా మేరకు పసుపును మోతాదులో తీసుకోవచ్చు.
మధుమేహం: మధుమేహ వ్యాధిగ్రస్తులు పసుపును మోతాదులోనే తీసుకోవాలి. ఎందుకంటే వీరి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, రక్తం పచులుగా అయ్యే మెడిసిన్స్ ను వాడుతారు. సో అలాంటి మందులను వాడుతున్నప్పుడు పసుపును ఎక్కువగా తీసుకుంటే వారి శరీరంలో బ్లడ్ శాతం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఈ వ్యాధిగ్రస్తులు ఇతర అనారోగ్య సమస్యకు గురికావొచ్చు.
కామెర్ల సమస్య: కామెర్లున్న వాళ్లు పసుపు ను అస్సలు తినకూడదు. వారికి పెట్టే కూరల్లో కూడా పసుపును వినియోగించకూడదు. ఈ వ్యాధి పూర్తిగా నయం అయిన తర్వాత పసుపును తీసుకున్నా ఏమీ కాదు కానీ.. కామెర్లున్నప్పుడు తింటే ప్రమాదమే. ఇవి నయం అయిన తర్వాత వైద్యుడి సలహా మేరకు పసును వినియోగించాలి.
పసుపు వాడకం వల్ల రక్తం గడ్డకట్టే ప్రాసెస్ నెమ్మదిస్తుంది. కొంత మందికి అనుకోకుండా ముక్కునుంచి లేదా.. ఇతర శరీర భాగాల నుంచి రక్తం కారుతుంటుంది. అటు వంటి వారు పసుపు వాడకాన్ని తగ్గించాలి. లేదంటే ప్రమాదంలో పడ్డట్టే..
ఈ వ్యాధిగ్రస్తులు రోజుకు 1 లేదా 3 టీస్పీన్ల పసుపును తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక్క టీస్పూన్ లో కర్కుమిన్ 170 నుంచి 190 mg ల వరకు ఉంటుంది. సో ఒక్క రోజుకు 400 ల కంటే తక్కువ కర్కుమిన్ తీసుకోకూడదు. అలాగని 800 mgల కంటే ఎక్కువ కర్కుమిన్ తీసుకోవడం కూడా మంచిది కాదు. సో ఈ వ్యాధిగ్రస్తులు ఈ కొలతలు పాటించి పసుపును తీసుకుంటే సురక్షితమే.
Covid-19 New Variant : వెలుగులోకి వచ్చిన మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే చాలా డేంజర్..
Deepthi Sunaina: దీప్తి సునయన బాధలో ఉంటే .. షణ్ముఖ్ సిరితో చిల్ అవుతున్నాడా..?
RGV: సపోర్ట్ చేయాల్సింది పోయి.. మా నెత్తి మీద కూర్చుంటున్నారు: ఆర్జీవీ
Rashmika-Vijay Devarakonda: రష్మిక, విజయ్ దేవరకొండ నిజంగానే ప్రేమలో పడ్డారా..?
Gold-Silver Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Sreemukhi: అదిరేటి అందాలతో హొయలు పోతున్న శ్రీముఖి.. వావ్ వాటే బ్యూటీ అనాల్సిందే..
Share this content: