దర్వాజ-హైదరాబాద్
మీరు ఎప్పుడైనా తెల్లవారుజామున 3-5 గంటల మధ్య నిద్ర లేచారంటే మళ్లీ నిద్ర పోవడానికి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? మీకు లేకపోయినా కొంత మంది ఆ సమయంలో మేల్కొంటారు. తర్వాత నిద్ర పోదామని ట్రై చేసిన రాదు. ఇది సాధారణంగా కనిపించే విషయమే అయినా రోజువారి అలవాటు కాకుండా అప్పుడప్పుడు ఇలా జరిగితే మీ శరీరం ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని అర్థం. మీ శక్తి స్థాయిలు, దృష్టి, మానసిక స్థితిని కూడా ఇది దెబ్బతీస్తుంది.
ఆరోగ్య నిపుణులు చాలా మంది ఈ సమయంలో మేల్కొవడమనేది మన జీవ వ్యవస్థల సహజ ప్రక్రియలతో ముడిపడి ఉందని భావిస్తున్నారు, ముఖ్యంగా హార్మోన్, రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులతో కూడినవిగా పేర్కొంటున్నారు. ఈ ప్రారంభ మేల్కొలుపుల వెనుక ఉన్న కొన్ని కారణాలు, మీరు నిద్రపోవడానికి సహాయపడే చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం, హార్మోన్లలో వచ్చే చిక్కులు

నిద్ర, ఆరోగ్య ఆప్టిమైజేషన్ పై తన పరిశోధనకు ప్రసిద్ధి చెందిన అస్ప్రే.. ఈ 3-5 ఉదయం మేల్కొలుపులకు రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కారణమని పేర్కొన్నారు. రక్తంలో చక్కెర త్వరగా పడిపోవడం వల్ల శరీరం కార్టిసాల్, ఆడ్రినలిన్ వంటి ఒత్తిడి రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి ఉత్తేజపరిచే ప్రభావాలను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కాలేయం, కండరాలలో ఉన్న గ్లూకోజ్ విడుదలకు సహాయపడతాయి, అవి నిద్రకు కూడా అంతరాయం కలిగిస్తాయి.
ఈ ఇబ్బంది రాకుండా పడుకునే ముందు కొద్దిగా స్నాక్స్ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ముడి తేనె, ఎంసిటి ఆయిల్ (కొబ్బరి లేదా పామాయిల్ నుండి ఉత్పత్తి అవుతుంది), కొల్లాజెన్ అన్నీ నెమ్మదిగా మండే శక్తి వనరులు, ఇవి రక్తంలో చక్కెర పడిపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
దీర్ఘకాలిక ఒత్తిడి నుండి అధిక కార్టిసాల్ స్థాయిలు

3-5 ఉదయం మేల్కొలుపులకు వెనుక మరొక కారణం దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా కార్టిసాల్ స్థాయిలు పెరగడంగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి హార్మోన్ గా పిలిచే కార్టిసాల్ మన శరీర శక్తి స్థాయిలు, రోగనిరోధక ప్రతిస్పందన, నిద్ర-మేల్కొనే చక్రాన్ని నియంత్రించడంలో అనేక విధులను కలిగి ఉంటుంది. అధిక కార్టిసాల్ స్థాయిలు, ముఖ్యంగా రోజు తెల్లవారుజామున తీసుకువచ్చిన అప్రమత్తత స్థితి మిమ్మల్ని అకస్మాత్తుగా మేల్కొలుపుతుంది.
ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడటానికి, లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా చిన్న చప్పుడు అయినా త్వరగా మేల్కొనే అవకాశాన్ని తగ్గిస్తాయి.
వృద్ధాప్యం, హార్మోన్ల మార్పుల ప్రభావం
వృద్ధాప్యం కారణంగా హార్మోన్ల మార్పులు కూడా అర్ధరాత్రి మేల్కొనడానికి దారితీస్తాయి. నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ వయసు పెరిగే కొద్దీ మన శరీరం చిన్న మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. రుతువిరతి వంటి అనేక జీవిత దశలతో సంబంధం ఉన్న హార్మోన్ల మార్పులు నిద్ర భంగం, అసాధారణ సమయాల్లో ప్రజల మేల్కొలుపుకు కారణమవుతాయి.