Breaking
Tue. Nov 18th, 2025

Bonalu : ఎస్ బీ పల్లిలో ఘనంగా బోనాలు..

Seriguda Bhadrapalli, Bonalu Festival

దర్వాజ-కొత్తూరు

⚈ అమ్మవారి దయ, చల్లని చూపు, కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలి
⚈ ఎస్ బీ పల్లి తాజా మాజీ సర్పంచ్, సర్పంచుల సంఘం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి అంబటి ప్రభాకర్

ఎస్ బీ పల్లి బోనమెత్తింది. డప్పుచప్పుళ్లు.. బ్యాండు మోతలు .. ఊదుబత్తిల పొగలు.. యాప కొమ్మాలతో నెత్తిన బోనాలు.. శివసత్తుల పూనకాలు.. పోతురాజుల నృత్యాలు.. అమ్మవారి నామస్మరణ మధ్య గ్రామస్థులు అంతా దేవతకు బోనం సమర్పించారు. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలతో పోచమ్మ గుడి ప్రాంతం అంతా కిక్కిరిసి పోయింది. ఈ సందర్భంగా పోచమ్మ అమ్మవారికి పసుపు, కుంకుమలు, నైవేద్యం సమర్పించి అమ్మా సల్లంగ సూడు అంటు మొక్కులు మొక్కుకున్నారు.చివరగా గుడి వద్ద గ్రామ మహిళలు, యువతులు అంతా కూడి బతుకమ్మ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు.

ఎస్ బీ పల్లి తాజా మాజీ సర్పంచ్, సర్పంచుల సంఘం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి అంబటి ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామ యువత బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలనీ, అమ్మవారి దయ, చల్లని చూపు, కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు ​ బోనాల పండుగ శుభాకాంక్షలను తెలిపారు. ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా బోనాల పండుగను నిర్వహించిన గ్రామ యువతను అభినందించారు.

Read More

Manu bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ కు తొలి మెడల్..

హైద‌రాబాద్ ను వ‌ణికిస్తున్న నోరోవైరస్ ల‌క్ష‌ణాలేంటి? ఎలా వ్యాపిస్తుంది? ఎలా గుర్తించాలి?

హైద‌రాబాద్ పై కొత్త వైరస్ అటాక్.. రోజుకు వంద కేసులు.. హెల్త్ ఎమ‌ర్జెన్సీ రానుందా?

కేంద్ర బడ్జెట్ 2024-25: కొత్త పన్ను విధానంలో మార్పులు..

Budget 2024-25 Highlights: బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే?

Related Post