- టి.రాజప్ప, సెర్ప్ జేఏసీ జిల్లా అధ్యక్షులు
దర్వాజ-కొత్తూరు
సీసీలు తమ సొంత మండలాల్లో విధులు నిర్వహిస్తూ వివక్ష చుపుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపలు పత్రికలు చేయడం సరికాదని సెర్ఫ్ జేఏసీ జిల్లా అధ్యక్షులు టి,రాజప్ప తప్పుపట్టారు. కరోనా, ఎన్నికలు వంటి వివిధ కారణాల పేరుతో సెర్ఫ్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) లో బదిలీల ప్రక్రియను చేపట్టలేదు. ప్రస్తుతం అవి అన్ని ముగిసిన నేపథ్యంలో వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ క్రమంలో ఓ దినపత్రికలో బదిలీల పేరిట వచ్చిన వార్తలో సీసీల పై తప్పుడు ఆరోపణలు రావడం విచారకరమని అన్నారు. క్షేత్రస్థాయిలో 50 లక్షల మహిళల సంక్షేమం కోసం సీసీలు, సెర్ప్ సిబ్బంది రెండున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నామని అన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల, మహిళా శక్తి కార్యక్రమాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, స్కూల్ యూనిఫామ్స్ వంటి ఎన్నో కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంలో సెర్ఫ్ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నామన్నారు. అలాంటి తమపై వివక్ష చుపుతూ అధికారం దుర్వినియోగానికి పాల్పడుతున్నారని స్థానికంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయనడం తగదని హితవు పలికారు. పత్రికలు నిజాలు రాయలని కోరారు. సీసీలు సహా సిబ్బంది అంతా మహిళా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని సీసీ లపై వచ్చిన వార్తను ఖండిస్తూన్నామని తెలిపారు.