దర్వాజ-రంగారెడ్డి
Devuni padakal: గత నెలలో కురిసిన భారీ వర్షం కారణంగా తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామ పరిధిలోని మహ్మద్ ఖాన్ చేరువు కట్ట తెగిపోయింది. దాదపు 40 రోజులు కావస్తున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామ ప్రజలు, రైతులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా, ఈ మహ్మద్ ఖాన్ చేరువు తెగిపోవడంతో దాని కింది పరిధిలో ఉన్న కల్వర్టు సైతం భారీగా వచ్చిన వరద నీటికి కొట్టుకుపోయింది. ఈ దారి గుండా నిత్యం వందలాది మంది రైతులు వారి పంట పొలాలకు వెళ్తారు. తప్పని పరిస్థితుల్లో రైతులు.. ఉదయం, సాయంత్రం నీటిలో తడుస్తూ ఆ దారిని దాటాల్సి వస్తున్నది.
ఈ నేపథ్యంలోనే గ్రామ ఉపసర్పంచ్, పలువురు వార్డు మెంబర్లు సొంత డబ్బు లక్ష రూపాయలతో గతంలో కల్వర్టును నిర్మించారు. తాజాగా ఉప సర్పంచ్ ఆర్.తిరుపతి, వార్డు మెంబర్లు ఏ.వెంకటేష్, జి.గణేష్, ఏ.నర్సింహ్మ కలిసి రూ.60 వేల సొంత డబ్బుతో కల్వర్టుకు మరమ్మత్తులు చేయించారు.
రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్.. 8 మంది మృతి
లింగ వివక్ష.. పితృస్వామ్యం.. మధ్యలో మహిళ !
పెరిగిన పెట్రోల్ ధరలు.. సెంచరీ కొట్టిన డీజిల్
లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక కారణాలు..
యూపీలో మరో దారుణం.. బాలికపై లైంగిక దాడి.. హత్య !
నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్
అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక