Loading Now
Devuni padakal_ sri venkateshwara swamy jatara 2021

శ్రీవారి కళ్యాణం.. కమనీయం! దేవుని పడకల్ జాతర

దర్వాజ-రంగారెడ్డి

రంగా రెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, దేవునిపడకల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అత్యంత పూరతనమైనది. ఇక్కడ ప్రతి సంవత్సరం వేసవికాలం మొదలయ్యే సమయంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఇక్కడి వస్తారు. ఈ ఏడాది జాతర మార్చి 27 మొదలు కొని వెంకటేశ్వర స్వామి కల్యాణం, తేరు, లంకదాహణం, చక్రతీర్థం మొదలైన దైవ కార్యక్రమాలు జరుపుకుంటూ ఏప్రిల్ 2 తో ముగుస్తుంది. ఏక శిలా లో శ్రీదేవి, భూదేవి సమేతంగా గా శ్రీ వెంకటేశ్వర స్వామివారు గరుడ వాహనంపై వెలిసిన అతి పురాతనమైన దేవాలయం ఇక్కడ ఉండడం విశేషం.

Devuni-padakal_-sri-venkateshwara-swamy-jatara శ్రీవారి కళ్యాణం.. కమనీయం! దేవుని పడకల్ జాతర

గర్భగుడి, మండపం, గజస్థంభం, ముందు ఎతైన గోపురం, కల్యాణ మండపం మొదలైన అంగులతో విజయనగర ఆర్కిటెక్చర్ లో ఆలయ నిర్మాణం జరిగింది. ఇది పూర్తి రాతి ఆలయం. తెలంగాణ రచయిత కపిలవాహి లింగమూర్తి గారు తన “పాలమూరు దేవాలయాలు” పుస్తకము లో దీని ఒక గొప్ప కట్టడం గా కీర్తించడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు . ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయం లో జాతర ఏటేటా అంగరంగవైభవంగా జరుగుతుంది. జాతర మొత్తం ఒక ఎత్తు అయితే ఇక్కడ జరిగే ఎద్దుల పందెంగుండు మరొక ఎత్తు. ఈ ఎద్దుల పోటీలలో పాల్గొనడానికి తెలంగాణ తో పాటు, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వచ్చి పాల్గొంటారు. అందులో పాల్గొనే జాతి రత్నాలు లాంటి ఎద్దులను చూడడానికి ప్రజలు ఉత్సహం చూపిస్తారు.

Devuni-padakal_-sri-venkateshwara-swamy-jathara-2021 శ్రీవారి కళ్యాణం.. కమనీయం! దేవుని పడకల్ జాతర

తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్

జాతర అంటే అందరికి ఆసక్తే. జాతర సందర్భంగా నిర్వహించే ఎద్దుల పందెం గుండు అంటే చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అమితాసక్తి. ఏటేటా ఎద్దుల పందెం గుండు చూడడానికి వేల సంఖ్యలో జనం తరలివస్తారు. అటువంటి ఎద్దుల పందెం గుండు నిర్వహణ పై నీలి మేఘాలు కమ్ముకోవడం గ్రామస్తులను కలవరపెడుతోంది. గత సంవత్సరం కరోనా కారణంగా ఎద్దుల పందెం ను నిర్వహించ కపోవడం వలన భక్తులు చాలా నిరుత్సహపడ్డారు. ఇప్పటికీ కరోనా మహమ్మారి కలవరం రేపుతూనే ఉంది. అయితే,  ఈ సంవత్సరమైన కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ.. ఎద్దుల పందెం గుండు కార్యక్రమాన్ని నిర్వహించాలని భక్తులు, స్థానికులు కోరుకుంటున్నారు.

ఎమ్మెల్సీ పోరు.. ‘బ్యాలెట్ బాక్సులో గోల్ మాల్’ జరిగిందా?

రైత‌న్న ఉద్య‌మం.. 111వ రోజు

ఎంపీ అరవింద్ కు కేంద్రంతో కొట్లాడే దమ్ముందా?

మరణ ముప్పు పురుషుల్లోనే అధికం !

ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత!

Share this content:

You May Have Missed