బ‌డి పిల్ల‌ల‌కు పుస్త‌కాలు, నోట్ బుక్స్ తో కూడిన కిట్స్ పంపిణీ

SB pally, Ambati Nandu

దర్వాజ-కొత్తూరు

ఎస్బీ పల్లికి చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు లింగారం సురేష్ గౌడ్ జన్మదినం సందర్బంగా మాజీ సర్పంచ్, మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు అంబటి ప్రభాకర్ సూచన మేరకు ప్రభుత్వ పాఠశాల, అంగ‌న్వాడీ విద్యార్థులకు పుస్త‌కాలు, నోట్ బుక్స్ తో కూడిన కిట్స్ ను గ్రామ యువ‌కులు పంపిణీ చేశారు. ఈ క్ర‌మంలోనే చిన్నారులు ‘హ్యాపీ బ‌ర్త్ డే సురేష్ అంకుల్’ అంటూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా గ్రామ యువ నాయ‌కుడు అంబ‌టి నందు, అంబ‌టి శ్రీశైలం మాట్లాడుతూ.. నేటి బాల‌లే రేప‌టి పౌరులు.. కాబ‌ట్టి వారికి త‌గిన ప్రోత్సాహం అందిస్తే గ్రామ ప్ర‌గ‌తితో పాటు దేశాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించే పౌరులుగా ఎదుగుతార‌ని అన్నారు. విద్యార్థుల‌కు త‌మ వంతు సాయం చేయ‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. అలాగే, పేద‌ల కోసం ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న‌ సురేష్ గౌడ్ మ‌రిన్ని పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు.

SB-Pally-school-1024x439 బ‌డి పిల్ల‌ల‌కు పుస్త‌కాలు, నోట్ బుక్స్ తో కూడిన కిట్స్ పంపిణీ
SB Pally school

కొత్తూరు మండలంలోని ఎస్బీ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థులు, స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్, గ్రామ‌ యువ నాయ‌కులు అంబటి శ్రీశైలం, అంబటి నందు, అంబటి వెంకటేష్, సున్నాల శ్రీనివాస్, ఏశమోని లింగం, దాసరి శేఖర్, సున్నల మణికంఠ, దాసరి సురేష్, పర్తపు రమేష్, దండు రాఘవేందర్ త‌దితరులు పాల్గొన్నారు.

Related Post