కొత్తూరు వై జంక్షన్ లో ఘోర రోడ్డు ప్రమాదం

KothurY Junction, Road Accident
KothurY Junction, Road Accident

ద‌ర్వాజ – కొత్తూరు

కొత్తూరు వై జంక్ష‌న్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మూడు వాహానాలు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో రెండు డీసీఎం వ్యాన్లు, ఒక లారీ ఢీ కొన్నాయి. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ వద్ద చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఈ రోడ్డు ప్ర‌మాదం గురించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తురూ వై జంక్ష‌న్ వ‌ద్ద బెంగళూరు నుంచి పైపుల లోడుతో వస్తున్న లారీ యూ టర్న్ తీసుకుంటున్న స‌మ‌యంలో డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంతో ఆ లారీ హైదరాబాద్ నుండి వస్తున్న మరో డీసీఎం ని ఢీ కొట్టింది. దీంతో పత్తి బ్యాగుల లోడ్ తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది.

ఈ మూడు భారీ వాహ‌నాలు ఢీ కొన‌డం వ‌ల్ల డీసీఎం బోల్తా ప‌డింది. ఈ బోల్తా పడిన డీసీఎం అక్క‌డ‌నుంచి వెళ్తున్న బైక్ పై ప‌డ‌టంతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీలో ఇరుక్క పోయిన డ్రైవర్ ను బైటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్య‌క్తిని పెంజర్ల గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల అంజయ్య (45) గా గుర్తించారు. స్థానిక పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని విచార‌ణ చేస్తున్నారు.

KothurY Junction, Road Accident 12-07-2024.mp4

Related Post