Loading Now

ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు.. మంత్రి హరీష్ రావు చేస్తున్న కృషి ప్రశంసనీయం..

ద‌ర్వాజ‌- నంగునూర్: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు ఆదేశాల మేర‌కు ఇవాళ నంగునూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, మిఠాయిల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాగుల సారయ్య మాట్లాడుతూ.. తెరాస‌ ప్ర‌భుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అద్భుతమైన సేవలు అందుతున్నాయని అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా.. ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందిస్తున్న ఘనత మ‌న కేసీఆర్ ప్రభుత్వానిదేని ఆయన పేర్కొన్నారు.

అనంత‌రం పీఏసీఎస్ ఛైర్మన్ కోల రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రికి రావాలంటే.. గ‌తంలో భయపడే పరిస్థితి ఉండేవని… కానీ, తెరాస ప్ర‌భుత్వంలో అలాంటి పరిస్థితులేవీ లేవని పేర్కొన్నారు. మహిళ, శిశు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోన్న తెరాస‌ ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేస్తున్నద‌ని, ఈ పథకం అమ‌లు చేయ‌డం వ‌ల్ల‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలవరీల సంఖ్య పెరుగుతోందనీ అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా గర్భిణీల కోసం.. కేసీఆర్ ప్ర‌భుత్వం మరో కొత్త కిట్‌ను ప్రవేశపెట్టనున్న‌ద‌ని, గర్భిణీ మహిళల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ‘కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌’ను అందించనున్నార‌ని తెలిపారు. మ‌న ఎమ్మెల్యే హ‌రీష్ రావు గారు.. వైద్య‌, ఆర్యోగ శాఖ మంత్రిగా చేస్తున్న సేవల‌ను కొనియాడారు.

అలాగే.. మాజీ మార్కేట్ కమిటీ ఛైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుంద‌న్నారు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని మెరుగైన‌ వైద్య సేవ‌లు ప్ర‌జ‌ల అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్య సేవల పట్ల బాలింతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా నాణ్యమైన ప్రభుత్వ వైద్యం కేవలం తెలంగాణలోనే అందుతోందని అన్నారు. వైద్య‌, ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు సేవ‌ల‌ను కొనియాడారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతో మంది పేద‌ల‌ను ఆయ‌న ఆదుకున్నారని ప్ర‌శంసించారు.

మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి హ‌రీష్ రావుల‌కు నిరుపేదల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ప్ర‌భుత్వం అందిస్తున్న‌ వైద్య సేవలపై నమ్మకంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్ల‌కుండా ప్రభుత్వ ఆస్ప‌త్రుల‌కు వ‌స్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాగుల సారయ్య, పిఏసీఎస్ ఛైర్మన్ కోల రమేష్ గౌడ్, మాజీ మార్కేట్ కమిటీ ఛైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఇంచార్జి ఎంపిడివో వేణుగోపాల్, మండల కో అప్షన్ సభ్యులు రహీమ్ పాషా, రైతుబంధు స‌మితి గ్రామ శాఖ అధ్య‌క్షులు కోల సతీష్ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు రేకులపల్లి వెంకట్ రెడ్డి, తెరాస గ్రామ శాఖ అధ్య‌క్షులు ఉల్లి చిన్న మల్లయ్య యాద‌వ్, నాయకులు రవీంద్ర చారి, డాక్టర్ రాఘవేంద్ర, గైనకాలజిస్ట్ అనిత ఆసుపత్రి సిబ్బంది లిఖిత తదితరులు పాల్గొన్నారు.

nangnoor-hospi ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు.. మంత్రి హరీష్ రావు చేస్తున్న కృషి ప్రశంసనీయం..

Share this content:

You May Have Missed