- సమస్యల పరిష్కారానికి కృషి
- ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
- పేద ప్రజల నోట్లో మట్టికొడుతున్న ప్రభుత్వం
- జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్
దర్వాజ-రంగారెడ్డి
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శనివారం తలకొండపల్లిలో నిర్వహించిన మండల సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలకొండ పల్లి మండల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ప్రజల డబ్బులను ప్రజలకోసమే ఖర్చు చేయాలి
పేద ప్రజల నోట్లో ప్రభుత్వం మట్టికొడుతుందని జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అన్నారు. శనివారం తలకొండపల్లిలో నిర్వహించిన మండల సర్వసభ సమావేశంలో ఉప్పల వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, పింఛన్లు రాక ఎంతో మంది బీద ప్రజలు తిప్పలు పడుతున్నారని తెలిపారు. మంజూరైనా పింఛన్లను కూడా ఈ ప్రభుత్వం ఏదో వంకతో ఆపేస్తుందని అన్నారు. ప్రజల డబ్బును ప్రజలకోసం ఖర్చు చేయాలని సూచించారు.
అనంతరం ఎంపీపీ నిర్మల శ్రీశైలం మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరిని అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ఎస్సై వరప్రసాద్ మాట్లాడుతూ.. కోవిడ్-19 నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలని సూచించారు.
అనంతరం ఆఫీసర్లు మండలంలో పూర్తయిన పనుల వివరాలు తెలిపారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు వారి గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. కార్యక్రమంలో పలువురు లీడర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.
Share this content: