Breaking
Sat. Jun 28th, 2025

ఘనంగా బీరప్ప బోనాలు

దర్వాజ‌- నంగునూర్: నంగునూర్ మండ‌లం సిద్ద‌న్న‌పేట గ్రామంలో ఆదివారం కురుమ సంఘం ఆధ్వ‌రంలో బీరప్ప బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామంలోని బీర‌ప్ప ఆలయంలో ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు, యువతులు బోనాలను ఊరేంగిపుగా తీసుక‌వ‌చ్చి..స్వామి వారికి బోనాల‌ను సమర్పించారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పండుగ‌కు హాజ‌రైన భక్తులు, ప్రజాప్రతినిధులుబీరప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షుడు, ఎంపీటీసీ బెదురు తిరుపతి, బెదురు దుర్గయ్య, మల్లయ్య, యాదయ్య, భాస్కర్, పర్శరాములు, నర్సింలు, ఎల్లేశ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Related Post