దర్వాజ-కొత్తూరు
కాంగ్రెస్ నాయకులు ఎస్బీ పల్లి మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ జన్మదిన వేడుకలను సోమవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే అంబటి ప్రభాకర్ ఉదయం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేకు ప్రభాకర్ కృతజ్ఙతలు తెలిపారు.
అలాగే, కొత్తురులో ఎంపీపీ మధు సూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, ప్రజలు పాలుపంచుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా కొత్తూరు, నందిగామ, ఫరూక్ నగర్ లతో పాటు వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన కార్యాలయంలో, గ్రామంలో పులమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రభాకర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు పేదలకు పండ్లు, ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేశారు.