Loading Now

ఏకాభిప్రాయంతోనే సమాజాభివృద్ధి..

ద‌ర్వాజ- నంగునూర్: నంగునూర్ మండల కేంద్రంలోని ప‌ద్మ‌శాలి స‌మాజంలో ఆదివారం ర‌చ్చ ర‌జిత‌- సిద్దు దంప‌తులు ప‌ద్మ‌శాలి కులదైవం శ్రీ భ‌క్త మార్కేండ‌య స్వామి వారి ఫోటోల‌ను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మ నేప‌థ్యంలో దాస‌రి ల‌క్ష్మీ నారాయ‌ణ దంప‌తులు అన్న‌దాన కార్య‌క్ర‌మం చేపట్టారు. ఈ సంద‌ర్భంగా ప‌ద్మశాలి స‌మాజ పూర్వ అధ్యక్షుడు దాస‌రి రామ‌లింగం మాట్లాడుతూ.. శ్రీ భ‌క్త మార్కేండ‌య స్వామి వారి ఫోటోల‌ పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన ర‌చ్చ ర‌జిత‌- సిద్దు దంప‌తులను అభినందించారు. ఈ కార్య‌క్రమం స్ఫూర్తితో ఇత‌ర కులబంధువులూ ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని కోరారు. అలాగే.. పద్మశాలీయులు రాజకీయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న రోజుల్లో అందరూ ఒక తాటిపై న‌డిచి.. స‌మాజాభివృద్ధికి కృషి చేయాల‌ని కోరారు. యువ స‌భ్యులు ముందుకు వ‌చ్చి.. స‌మాజాభివృద్దికి పాటు ప‌డాల‌ని సూచించారు. ప్ర‌తినెలా సంఘ స‌భ్యులు స‌మావేశమయ్యేలా వివిధ‌ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా మార్కేండ‌య దేవాల‌య నిర్మాణ ప్ర‌తిపాద‌న‌లను ముందు తీసుక‌వ‌చ్చారు. కుల స‌భ్యులంద‌రీ ఐక్యతతోనే ఆల‌య నిర్మాణం జ‌రుగుతుంద‌ని అన్నారు.

అనంత‌రం ప‌ద్మశాలి స‌మాజ అధ్యక్షుడు దాస‌రి ర‌వికుమార్ మాట్లాడుతూ.. ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన ర‌చ్చ ర‌జిత‌- సిద్దు దంప‌తులను ప్ర‌త్యేకంగా అభినందించారు. గ‌తంలో ఇలాంటి కార్యక్ర‌మంలో ఎవ్వ‌రూ చేయ‌లేద‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని స్ఫూర్తితో ఇత‌రులు సేవ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతార‌ని ఆశించారు. స‌మాజ సభ్యులంద‌రూ ఏకాభిప్రాయంతో న‌డ‌వాల‌ని, స‌మాజ అభివృద్దికి సహకారం అందించాల‌ని కోరారు.

అనంత‌రం ప‌ద్మశాలి స‌మాజ స‌భ్యులు దాసరి ర‌వింద‌ర్ మాట్లాడుతూ.. పద్మశాలీలంద‌రూ ఐక్య‌త‌తో ఉండాల‌ని, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయప‌రంగా ఉన్న‌తిని సాధించాల‌ని సూచించారు. ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటూ స‌మాజాభివృద్దికి కృషి చేయాల‌ని, మ‌నం చేసే ప‌నులు ఇత‌ర కులాలవారికి మార్గద‌ర్శ‌కంగా ఉండాల‌ని అన్నారు. ప్రతిభ గల పేద పద్మశాలి విద్యార్థులు ఉన్నత చదువులకు తాను స‌హకారం అందిస్తాన‌ని హామీ ఇచ్చారు.

అలాగే.. దాత, ప‌ద్మ‌శాలి సమాజ ఉపాధ్యక్షులు ర‌చ్చ సిద్దు మాట్లాడుతూ.. త‌న త‌ల్లిదండ్రులు స్వ‌ర్గీయ ర‌చ్చ గౌర‌మ్మ‌- సుద‌ర్శ‌ణం జ్ఞాప‌కార్థం శ్రీ భ‌క్త మార్కేండ‌య స్వామి వారి ఫోటోల‌ను పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. త‌నకు వీలైనంత మేర‌ జాతి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. అనంత‌రం ర‌చ్చ ర‌జిత‌- సిద్దు దంప‌తులను కుల సభ్యులు స‌న్మానించారు. గ‌తంలో ఇలాంటి కార్య‌క్ర‌మాన్ని ఎవ్వ‌రూ నిర్వ‌హించ‌లేద‌ని పలువురు కొనియాడారు. వారి కుటుంబంపై భ‌క్త మార్కేండ‌య స్వామి వారి క‌రుణ‌కటాక్షాలు ఎల్ల‌వేళ ఉంటాయ‌ని కుల పెద్ద‌లు ఆశీర్వ‌దించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ద్మ‌శాలి సమాజం నంగునూర్ కార్య‌వ‌ర్గం, కుల స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

nangnoor11-1024x576 ఏకాభిప్రాయంతోనే సమాజాభివృద్ధి..

Share this content:

You May Have Missed