Loading Now
Rythu Bandhu_charakonda

రైతుబంధు సాయాన్ని క్రాప్ లోనుకి జ‌మ‌ చేయవద్దు

  • చార‌కొండ‌లో యూనియ‌న్ బ్యాంకు మేనేజ‌ర్ కు విన‌తి ప‌త్రం అంద‌జేసిన బీజేవైఎం నేత‌లు

ద‌ర్వాజ‌-చార‌కొండ‌

ఈ నెల రెండో వారం నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం రైతు బంధు సాయాన్ని రైతుల‌కు వారి వారి అకౌంట్ల‌లో జమ చేస్తోంది. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం సైతం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకంలో భాగంగా రైతులకు అందించే సాయాన్ని ఇటీవలే అందించింది. అయితే, సాగు పెట్టుబడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సాయం ఆసరాగా ఉంటుందనకున్న రైతులకు మొండిచేయి మిగిలింది. ఎందుకంటే ప్రభుత్వ సాయాన్ని బ్యాంకులు రైతులకు ఇవ్వకుండా క్రాప్ లోన్ కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో సాగు పెట్టుబడికి కోసం రైతులకు ఇక్కట్లు తప్పెలా లేవని చారకొండ బీజేవైఎం నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే చారకొండలోని యూనియన్ బ్యాంకు మేనేజర్ ను కలిసి రైతు సాయన్ని రైతులకే అందించాలనీ, క్రాప్ లోన్ కింద జమ చేయవద్దని బీజేవైఎం నేతలు కోరారు.

ప్రభుత్వాల సాగు పెట్టబడి సాయాన్ని క్రాఫ్ లోన్ కింద జమచేస్తే అన్నదాతలు ఇబ్బందులు పడుతారని వివరించారు. ఆ డబ్బును రైతులకు ఇవ్వాలని కోరుతూ బ్యాంకు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చారకొండ మహిళా మోర్చ అధ్యక్షురాలు గిరిజమ్మ, బీజేవైఎం అధ్యక్షుడు రవి నాయక్, కార్యదర్శి మోగిళ్ల కన్న, దళిత మోర్చ అధ్యక్షులు ఎలిమినేటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Share this content:

You May Have Missed