Loading Now
telangana minister t harish rao

చిన్నారి శాన్వితకి మంత్రి హ‌రీష్ అండ‌

ద‌ర్వాజ‌-సిద్దిపేట‌

తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు మ‌రోసారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవ‌ల గాయ‌ప‌డి తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ చిన్నారికి అండ‌గా నిలిచారు. వివ‌రాల్లోకెళ్తే.. సిద్దిపేట జిల్లాకు చెందిన 11 నెల‌ల చిన్నారి శాన్విత గ‌త వారం ఆడుకుంటూ కింద ప‌డ‌టంతో ముక్కుకు గాయం అయింది. ఈ క్ర‌మంలోనే ఆ చిన్నారిని సిద్ధిపేట ఆస్ప‌త్రిలో చికిత్స అందించారు.

అయితే, తీవ్ర ర‌క్తస్రావం కావడంతో బ్లడ్ అవసరం కావడంతో టీహెచ్ఆర్ బ్ల‌డ్ డోన‌ర్స్ టీం స‌కాలంలో స్పందించి.. ఆ చిన్నారికి బ్ల‌డ్ అందించారు. అయిన‌ప్పటికీ ఆ చిన్నారి ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారడంతో హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌యివేటు ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ఆరోగ్య ప‌రిస్థితిని ఆకుబ‌త్తిని రాము.. మంత్రి హ‌రీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన హ‌రీష్ రావు చిన్నారి చికిత్స కోసం రూ.1,00,000 ఆర్థిక సాయం అందించారు.

Share this content:

You May Have Missed