దర్వాజ-సిద్దిపేట
తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక మార్పు చోటు చేసుకుంది. ఎన్నో రోజులుగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు నేటీతో తెరపడింది. కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లువిరిసింది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సాదుల పవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
నూతన టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్స్ పంచుతూ.. బాణా సంచా కాల్చుతూ.. హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సాదుల పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంతన్న నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అధికార తెరాసను గద్దె దించే సత్తా కాంగ్రెస్ కు ఉందననీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యతగా పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Share this content: