దర్వాజ-రంగారెడ్డి
Volleyball League: శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తలకొండపల్లి మండల పరిధిలోని దేవునిపడకల్ గ్రామంలో మంగళవారం నాడు ఓపెన్ టు హాల్ మెన్స్, ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, తలకొండపల్లి SI శివశంకర వరప్రసాద్ విచ్చేశారు. అలాగే, కానుగుల మల్లేష్ (వాలీబాల్ యూత్ ప్రెసిడెంట్), Lమందుకుమార్ రెడ్డి, L రంజిత్ కుమార్ రెడ్డి, సర్పంచ్ కడమోని శ్రీశైలం, ఉప సర్పంచ్ రాజమోని తిరుపతి (వాలీబాల్ యూత్ వైస్ ప్రెసిడెంట్) గుజ్జరి రాఘవేందర్ (అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్), ఆర్గనైజర్ పి మహేష్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.
Share this content: