విద్యుదాఘాతంతో 12 మేకలు మృతి.. ప్రభుత్వం ఆదుకోవాలని వినతి

darvaaja,latest news,Telugu news, తాజా వ‌ర్తాలు, తెలుగు వార్త‌లు, ద‌ర్వాజ‌, Siddipet, goats, electric wires, government, Siddannapet, Nangunur mandal, సిద్దిపేట, మేకలు, విద్యుత్ వైర్లు, ప్రభుత్వం, సిద్దన్నపేట, నంగునూరు మండలం,

దర్వాజ-సిద్దిపేట‌

నంగునూరు మండలంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. మండ‌లంలోని సిద్ధన్నపేట గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్ కు 12 మేకలు మృత్యువాత పడ్డాయి. సిద్ధన్నపేట గ్రామానికి చెందిన గౌరబోయిన నవీన్ .. తనకున్న గొర్రెలన్నింటిని మేత కోసం.. గ్రామ‌ శివారులోని రైతు ఖనాపురం మల్లయ్య వ్యవసాయ బావి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడు. ఆ మూగ జీవాల‌ను నీళ్లు తాగ‌డానికి వెళ్లిన క్ర‌మంలో విద్యుత్ షాక్ రావ‌డంతో మేకలన్నీ అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చనిపోయిన మేకల విలువ సుమారు రెండు లక్షల పై చిలుకు ఉంటుందని, కాపరి నవీన్ కు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్థులు కోరారు. విషయం తెలుసుకున్న తెరాస నాయ‌కులు ఎంపీటీసీ బెదురు తిరుపతి, భాస్కర్ రెడ్డి లు ఈ ఘ‌ట‌న‌ను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి.. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని బాధిత కుటుంబానికి భ‌రోసా ఇచ్చారు.

Related Post