దర్వాజ-అంతర్జాతీయం
Russian school shootings: సెంట్రల్ రష్యా స్కూల్ కాల్పుల్లో ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రాయిటర్స్ నివేదికల ప్రకారం.. సెంట్రల్ రష్యాలోని ఓ పాఠశాలలో సోమవారం ఉదయం ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ కాల్పుల ఘటనలో మొత్తం 13 మంది చనిపోగా, మరో 20 మంది గాయపడ్డారు.
ఉడ్ముర్టియా ప్రాంత గవర్నర్, అలెగ్జాండర్ బ్రెచలోవ్, ఇప్పటికీ గుర్తుతెలియని షూటర్ ఈ ప్రాంత రాజధాని ఇజెవ్స్క్‌లోని పాఠశాలలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న ఒక గార్డును, కొంతమంది పిల్లలను చంపినట్లు వీడియో ప్రకటనలో తెలిపారు.