Loading Now
students, hospital, food poisoning, Mangaluru, Shaktinagar,

ఫుడ్ పాయిజనింగ్ తో ఆస్ప‌త్రిపాలైన 130 మంది విద్యార్థులు

దర్వాజ-బెంగళూరు

Mangaluru food poisoning: ఫుడ్ పాయిజనింగ్ తో 130 మంది విద్యార్థులు ఆస్ప‌త్రిపాల‌య్యారు. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లోని మంగళూరులో చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అక్క‌డి నర్సింగ్, పారామెడికల్ కళాశాలలో 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర‌య్యార‌నీ, వారు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌నీ, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని జిల్లా యంత్రాంగం వెల్ల‌డించింది.

మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ మాట్లాడుతూ.. శ‌క్తినగర్ లో ఉన్న ఒక నర్సింగ్, పారామెడికల్ కళాశాలలో 130 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తో అస్వస్థతకు గురయ్యార‌ని తెలిపాఉ. విద్యార్థులు తమ హాస్టల్‌లోని మెస్‌లో ఆహారం తీసుకున్నారనీ, ఆ తర్వాత వారు కడుపునొప్పి, విరేచ‌నాలు, వాంతులు వంటి అనారోగ్య ప‌రిస్థితులు ఎదుర్కొన్నార‌ని స‌మాచార‌ముంద‌న్నారు.

బాధితులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరార‌ని అన్నారు. ఏజే ఆస్పత్రిలో 52 మంది, కేఎంసీ జ్యోతిలో 18 మంది, యూనిటీ ఆస్పత్రిలో 14 మంది, సిటీ ఆస్పత్రిలో 8 మంది, మంగళ ఆస్పత్రిలో 3 మంది, ఎఫ్ఆర్ ముల్లర్స్ ఆస్పత్రిలో ఇద్దరు విద్యార్థులు చేరారు. జిల్లా హెల్త్ ఇన్స్పెక్టర్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వారిని ఆస్ప‌త్రిలో అడ్మిట్ చేశార‌నీ, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యం ప్ర‌స్తుతం బాగానే ఉందన్నారు. దీనిపై త్వ‌ర‌లోనే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Share this content:

You May Have Missed