చ‌దువుకొమ్మ‌ని తండ్రి మంద‌లింపు.. మ‌న‌స్థాపంతో 9 ఏళ్ల‌ ‘ఇన్ స్టా క్వీన్’ ఆత్మ‌హ‌త్య‌

Insta Queen, suicide, Tamil Nadu, father, study, Thiruvallur, ఇన్‌స్టా రీల్స్, ఆత్మహత్య, తమిళనాడు, తండ్రి, చదువు, తిరువళ్లూరు,ఇన్‌స్టా క్వీన్,

ద‌ర్వాజ‌-చెన్నై

9-year-old ‘Insta Queen’ dies by suicide: త‌న చ‌దువుల గురించి తండ్రి అడిగినందుకు ఒక తొమ్మిదేండ్ల బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇన్‌స్టా రీల్స్ చేస్తుండ‌టం, దానికి అతుక్కుపోవ‌డంతో తండ్రి మంద‌లించ‌డంతో బాలిక బ‌ల‌వంతంగా ప్రాణాలు తీసుకుంద‌ని స‌మాచారం. ఈ షాకింగ్ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని తిరువళ్లూరు లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. తమిళనాడులోని తిరువళ్లూరులో తొమ్మిదేళ్ల బాలికను చదువుకోవాలని తండ్రి చెప్పడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తండ్రి కృష్ణమూర్తి తమ ఇంట్లో బాలిక ఉరేసుకుని ఉండటాన్ని గమనించారు.

ఇది ఎలా జరిగింది?

సోమవారం త‌న అత్తవారింటి సమీపంలో ఆడుకుంటున్న కుమార్తెను చూసిన కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి చదువుకోవాలని చెప్పి.. బాలికకు ఇంటి తాళాలు ఇచ్చాడు. అనంతరం బైక్ రీఫిల్ చేయడానికి బయలుదేరి రాత్రి 8.15 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఇంటి లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించి తలుపు తీయమని కూతురిని పిలిచినా ఎలాంటి స్పంద‌న‌లు రాలేదు.

కూతురు స్పందించకపోవడంతో కంగారు పడిన కృష్ణమూర్తి కిటికీ పగులగొట్టి ఇంట్లోకి వెళ్లాడు. లోపల తన కూతురు మెడలో కాటన్ టవల్ తో వేలాడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయింద‌ని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

తరచూ సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేసే ఆ అమ్మాయిని ఇరుగుపొరుగు వారు ముద్దుగా ‘ఇన్ స్టా క్వీన్ ‘ అని పిలిచేవారు.

Related Post