దర్వాజ-అంతర్జాతీయం
Afghanistan Suicide attack: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబూల్‌లోని ఓ మసీదు బయట భారీ బాంబు పేలుడు జరిగిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. మసీదు వెలుపల బాంబ్ పేలుడు జరిగిందన్నారు. ఈద్గా మసీదు ప్రవేశ ద్వారం వద్ద పేలుడు సంభవించడంతో మరణాల సంఖ్య పెరిగిందని ముజాహిద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కాగా, అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి హింసాత్మక ఘటన పెరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు నెలలో కాబుల్ ఎయిర్ పోర్టులో జరిగిన బాంబు దాడిలో 73 మంది మరణించగా.. వందమందికి పైగా గాయపడ్డారు. ఈ వారంలోనే చోటుచేసుకున్న మరో కాల్పుల్ల ఘటనలో ఓ జర్నలిస్టుతోపాటు మరో ముగ్గురు అఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్.. 8 మంది మృతి
లింగ వివక్ష.. పితృస్వామ్యం.. మధ్యలో మహిళ !
పెరిగిన పెట్రోల్ ధరలు.. సెంచరీ కొట్టిన డీజిల్
లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక కారణాలు..
యూపీలో మరో దారుణం.. బాలికపై లైంగిక దాడి.. హత్య !
నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్
అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక