Loading Now
After Wheat Export Ban, central Govt Bans Sugar Export Till October 31

Sugar Export Ban: చ‌క్కెర ఎగుమ‌తుల‌పై నిషేధం.. ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుద‌ల‌తో అప్ర‌మ‌త్తం.. !

దర్వాజ-న్యూఢిల్లీ

Govt Bans Sugar Export: దేశంలో ద్ర‌వోల్బ‌ణం పెరుగుద‌ల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. చ‌క్కెర ఎగుమ‌తుల‌పై నిషేధం విధించింది. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు క్రమంగా ఆకాశ‌మే హ‌ద్దుగా పెరుగుతుండ‌టం.. ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుద‌ల‌పై ఆందోళన వ్య‌క్తం అవుతున్న త‌రుణంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. జూన్ 1 నుండి చక్కెర ఎగుమతిపై నిషేధం విధించింది. చక్కెర ఎగుమతిపై ఆంక్షలు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఎండ‌ల తీవ్ర‌త కార‌ణంగా దిగుబ‌డి పై ప్ర‌భావం ప‌డింది. దీంతో దేశీయ చ‌క్కెర ధరలు పెరుగుతున్నాయి.

ఇక దిగుబ‌డి త‌గ్గిన నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం గోధుమ ఎగుమతులను నిషేధించిన రెండు వారాల తర్వాత చ‌క్కెర ఎగుమ‌తుల‌పై నిషేధం విధించింది. అయితే, కొన్ని స‌డ‌లింపుల మ‌ధ్య CXL, TRQ కింద EU మరియు USలకు చక్కెర ఎగుమతి చేయబడుతోంది. CLX మరియు TRQ కింద ఈ ప్రాంతాలకు నిర్దిష్ట మొత్తంలో చక్కెర ఎగుమతి జ‌రుగుతోంది. చక్కెర సీజన్ 2021-22 (అక్టోబర్-సెప్టెంబర్)లో దేశంలో చక్కెర దేశీయ లభ్యత మరియు ధర స్థిరత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో జూన్ 1 నుండి చక్కెర ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Share this content:

You May Have Missed