Loading Now
Agnipath, Army aspirants, protests , pensions , Bihar, Rajasthan, అగ్నిపథ్, ఆర్మీ అభ్య‌ర్థులు, నిరసనలు, పెన్షన్లు, బీహార్, రాజస్థాన్, ఆర్మీ, భ‌ద్ర‌తా బ‌లగాలు, ఉద్యోగాలు,

Agnipath: ‘అగ్నిప‌థ్’ పై ఆగ్ర‌హం.. చాలా ప్రాంతాల్లో ఆర్మీ అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు !

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
Agnipath: నాలుగేండ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైన్యంలోకి సైనికులను నియమించుకునే అగ్నిపథ్ పథకంపై ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది. ఆర్మీ ఉద్యోగార్ధులు ఉద్యోగ భద్రత, పెన్షన్ సంబంధిత అంశాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. బీహార్, రాజస్థాన్‌లలో ఆర్మీ అభ్య‌ర్థులు నిర‌స‌న‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్ల‌ను దిగ్భందించి నిర‌స‌న తెలుపుతున్నారు. వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. రైళ్ల‌ను సైతం అడ్డుకుంటున్నారు. నాలుగు ఏండ్లు ఉద్యోగం చేసిన త‌ర్వాత త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 4 ఏండ్ల త‌ర్వాత రోడ్ల‌పై ప‌డ‌తామ‌నీ, పింఛ‌న్ కూడా రాద‌ని పేర్కొంటున్నారు. ఇలాంటి అగ్నిప‌థ్ స్కీమ్ ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు కొనసాగించడంతో రెండవ రోజు కూడా నిరసనలు కొనసాగాయి. “సాయుధ దళాలలో చేరడానికి మేము చాలా కష్టపడుతున్నాము. నాలుగు సంవత్సరాల పాటు సర్వీస్, నెలల శిక్షణ మరియు సెలవులతో ఎలా ఉంటుంది? కేవలం మూడు సంవత్సరాలు శిక్షణ పొందిన తర్వాత మేము దేశాన్ని ఎలా రక్షించుకుంటాము? ప్రభుత్వం ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి”అని ఒక నిరసనకారుడు చెప్పిన‌ట్టు ఇండియా టూడే నివేదించింది.

Agnipath-1024x576 Agnipath: 'అగ్నిప‌థ్' పై ఆగ్ర‌హం.. చాలా ప్రాంతాల్లో ఆర్మీ అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు !

Share this content:

You May Have Missed