Breaking
Tue. Nov 18th, 2025

Agniveers: అగ్నివీరులు.. బీజేపీ నేత కైలాష్‌ విజ‌య‌వ‌ర్గీయ పై కేసు !

Complaint filed, Kailash Vijayvargiya, Agniveers, Congress , V Hanumanth Rao, BJP , Begum Bazar Police Station, army, Agnipath, ఫిర్యాదు, కైలాష్ విజయవర్గీయ, అగ్నివీరులు, కాంగ్రెస్, వి హనుమంత్ రావు, బీజేపీ, బేగంబజార్ పోలీస్ స్టేషన్, సైన్యం, అగ్నిపథ్,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Kailash Vijayvargiya: అగ్నిప‌థ్ స్కీమ్ పై వివాదం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో బీజేపీ నాయ‌కులు చేస్తున్న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అగ్నివీరుల‌పై బీజేపీ నాయ‌కుడు కైలాష్ విజ‌య‌వ‌ర్గీయ చేసిన వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదైంది. హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లోని ఆయ‌న పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి హనుమంతరావు ఫిర్యాదు చేశారు.

బీజేపీ పార్టీ కార్యాలయంలో భద్రత కోసం అగ్నివీర్లను నియమించుకుంటామ‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సైనికుల‌ను, భారత ఆర్మీని అవమానించేలా ఉన్నాయ‌ని హ‌నుమంత‌రావు అన్నారు. “నాలుగేళ్ల పాటు ఉద్యోగం ఇస్తామని, ఆ తర్వాత వదిలివేసేటప్పుడు 11 లక్షలు ఇస్తామని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత ఏం చేస్తారు కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు. కూలి పనులు లేక వ్యవసాయం చేయాల్సి వస్తోంది. గతంలో 15 నుంచి 20 ఏళ్ల పదవీకాలం ఉండగా ఇప్పుడు నాలుగేళ్లకు తగ్గించారు” అని మండిప‌డ్డారు. వెంట‌నే చర్యలు తీసుకుని ఆయ‌న‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Related Post