Breaking
Tue. Nov 18th, 2025

Ex Minster Narayana: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..

Andhra Pradesh 10th Class Paper Leakage : Ex Minster Narayana Arrest

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Ex Minster Narayana Arrest: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయ‌కుడు, ఏపీ మాజీ మంత్రి నారయణను (Ex Minster Narayana) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ఇటీవల పదో తరగతి పబ్లిక్ పేపర్ల లీకేజ్ (AP 10th Class Paper Leakage) విషయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ (Hyderabad)లోని కొండాపూర్ నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు (AP CID Police) ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో నారాయణ ఎస్వీ బ్రాంచ్ నుంచి తెలుగు పేపర్ లీక్ అయ్యిందని పోలీసులు గుర్తించారు. పాఠశాలకు చెందిన గిరిధిర్ (Giridhar) అనే వ్యక్తి వాట్సప్ నుంచి పేపర్ లీకైంద‌నీ, ఈ విషయంలోనే నారాయణ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరుకు తరలించి.. అక్కడ కోర్టులో హాజరు పరచనున్నారు.

Related Post