దర్వాజ-అమరావతి
FIR against former AP CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు చంద్రబాబుతో సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్, ఈపీఎల్ ప్రాజెక్ట్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీకుమార్, హెరిటేజ్ ఫుడ్స్ పేర్లను చేర్చారు.
గత నెల 27నే ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. అవతవకలు జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్దారించినట్టుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్లు 120బి, 420, 34, 35, 36, 37, 166, 167, 217 సహా అవినితి నిరోధక చట్టం సెక్షన్ 13(2), 13(1)(ఏ) కింద కడా కేసు నమోదు చేశారు.
ఇదిలావుండగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, ఏపీ మాజీ మంత్రి నారయణను (Ex Minster Narayana) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ఇటీవల పదో తరగతి పబ్లిక్ పేపర్ల లీకేజ్ (AP 10th Class Paper Leakage) విషయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ (Hyderabad)లోని కొండాపూర్ నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు (AP CID Police) ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో నారాయణ ఎస్వీ బ్రాంచ్ నుంచి తెలుగు పేపర్ లీక్ అయ్యిందని పోలీసులు గుర్తించారు. పాఠశాలకు చెందిన గిరిధిర్ (Giridhar) అనే వ్యక్తి వాట్సప్ నుంచి పేపర్ లీకైందనీ, ఈ విషయంలోనే నారాయణ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరుకు తరలించి.. అక్కడ కోర్టులో హాజరు పరచనున్నారు.
