Breaking
Tue. Nov 18th, 2025

Rains: కోస్తాంధ్రాకు భారీ వ‌ర్ష సూచ‌న.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు

Heavy rains, Uttar Pradesh, Telangana, AP, Tamil Nadu, Delhi, schools closed, rains, floods,భారీ వర్షాలు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, స్కూళ్లు బంద్, వానలు, వరదలు,

ద‌ర్వాజ‌-అమ‌రావ‌తి

Andhra Pradesh: కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 24 గంటల్లో అది బలహీనపడే అవకాశం ఉందనీ, దీని కార‌ణంగా కోస్తా ఆంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ఇక, ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో పాలకోడెరలో 14, నూజివీడులో 11, సెట్టిగుంటలో 10.3, పూసపాటిరేగ, బలిజపేటల్లో 9, భీమడోలు, భీమవరం, కళింగపట్నంలో 8, ఆళ్లగడ్డలో 7.8, ఇబ్ర‌హీంప‌ట్నంలో 7.4, చింత‌ల‌పూడిలో 7.4 సెంటి మీట‌ర్ల వర్షం కురిసింది.

Related Post